Bigg Boss Kaushal: బిగ్ బాస్ విన్నర్ కౌశల్ 'రైట్' ట్రైలర్ విడుదల.. అద్భుతంగా ఉందన్న మంచు మనోజ్..

Kaushal Right Movie: తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 తో ఎంతో పేరు తెచ్చుకున్న కంటెస్టెంట్ కౌశల్. కాగా కౌశల్ హీరోగా చేసిన రైట్ సినిమా డిసెంబర్ 30న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ట్రైలర్ ఈరోజు విడుదల కాక ఈ సినిమా ట్రైలర్ అధ్భుతంగా ఉందన్నారు హీరో మంచు మనోజ్..

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 29, 2023, 06:29 PM IST
Bigg Boss Kaushal: బిగ్ బాస్ విన్నర్ కౌశల్ 'రైట్' ట్రైలర్ విడుదల.. అద్భుతంగా ఉందన్న మంచు మనోజ్..

Kaushal Right Tariler: బిగ్ బాస్  కౌశల్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. బిగ్ బాస్ లో ఎవరు ఊహించనంత క్రేజ్ సొంతం చేసుకున్నారు కౌశల్. ఒక స్టార్ హీరోకి ఉండే రేంజ్ లో ఆయనకు ఆర్మీ లు కూడా అప్పట్లో ఫామ్ అయ్యాయి. బిగ్ బాస్ సీజన్ 2 వచ్చినప్పుడు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే మొత్తం కౌశల్ గురించే ఉండేది. తెలుగులో బిగ్ బాస్ సీజన్లో  వస్తు ఉన్న కౌశల్ క్రియేట్ చేసిన సెన్సేషన్ ఇప్పటివరకు ఏ బిగ్ బాస్ కంటెస్టెంట్ క్రియేట్ చేయలేదని చెప్పాలి.

ఇంతలా సెన్సేషన్ క్రియేట్ చేసిన కౌశల్ ఆ తరువాత మాత్రం కొంచెం సైలెంట్ అయిపోయాడు. ఆ తరువాత కొన్ని కొన్ని సినిమాలలో చిన్న క్యారెక్టర్స్ లో కనిపిస్తూ వచ్చిన కౌశల్ ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత ఫైనల్ గా రైట్ అనే సినిమాతో మన ముందుకి హీరోగా రాబోతున్నారు.  మణి దీప్ ఎంటర్టైన్మెంట్ పతాకం పై శంకర్ దర్శకత్వంలో రానున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో కౌశల్ మంద, లీషా ఎక్లైర్స్ హీరో హీరోయిన్ లుగా నటించారు. మలయాళంలో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో విడుదలై విజయవంతమైన 'మెమోరీస్' చిత్రానికి ఈ సినిమా రీమేక్.డిసెంబర్ 30న విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్, ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని ప్రసాద్ ల్యాబ్ లో ఏర్పాటు చేశారు.

 కాగా ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో మంచు మనోజ్ కౌశల్ గురించి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ‘సినిమా పరిశ్రమలో కష్ట సుఖాలు, ఒడిదుడుకులను దాటుకుని వచ్చిన వారే విజేతలుగా నిలబడతారు. దీనికి బిగ్ బాస్ ఫేమ్ కౌశల్ నిదర్శనమని’  హీరో మంచు మనోజ్ తెలిపారు. 

‘స్వశక్తితో ఎదిగిన వ్యక్తి కౌశల్, తనకంటూ ఒక ఆర్మీనే రూపొందడం సామాన్యమైన విషయం కాదు. ఏ చెట్టుకు అంతే గాలి అన్నట్టు ఎన్నో స్ట్రగుల్స్ చూసి వచ్చిన, కష్టపడే తత్వమున్న కౌశల్ ఇయర్ ఎండింగ్ లో హిట్ కొట్టి తన ప్రస్థానాన్ని కొనసాగించాలి. రైట్ మూవీ ట్రైలర్ చాలా బాగుంది, ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుంది’ అని చెప్పుకొచ్చారు. 

అనంతరం కౌశల్ మాట్లాడుతూ..నటుడిగా మంచి పేరు సంపాదించాలని తనకు కేవలం 18 సంవత్సరాలు ఉన్నప్పుడే రాజ కుమారుడు సినిమాతో పరిశ్రమకు వచ్చానని గుర్తు చేసుకున్నారు. ఇక 24 ఏళ్ల తరువాత బిగ్ బాస్ రూపంలో తనకు కలసి వచ్చిందని, తన కోసం ఒక ఆర్మీ తయారు కావడం అదృష్టమని అన్నారు. తన ఆర్మీ అందరినీ కలుసుకోవడానికి దాదాపు 8 నెలలు అన్ని ప్రాంతాలు తిరిగానని, ఆ సమయంలో తన ఫ్యాన్స్ తనని హీరోగా చూడాలనే కోరికను తెలుపడంతో హీరోగా వస్తున్నాను అని తెలిపారు. 

‘కరోనా సమయంలో ఎన్నో ఒడిదుడుకులను దాటుకుని షూటింగ్ పూర్తి చేశాం, ప్రతీ ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుంది. చిన్నా, పెద్దా అని తేడాలు లేకుండా అందరినీ ప్రోత్సహించే గొప్ప వ్యక్తి మంచు మనోజ్ ఈ కార్యక్రమానికి వచ్చి టీం ను ప్రోత్సహించడం సంతోషంగా ఉంది. హీరోగానే కాకుండా నటనకు ఆస్కారం ఉన్న ఏ పాత్ర అయినా చేయడానికి ఎప్పటికీ సిద్దంగా ఉంటాను. ప్రేక్షకులు చిన్న సినిమాలను కూడా పెద్ద మనసుతో ఆదరించాలి’ అని చెప్పుకొచ్చారు ఈ హీరో.

Also Read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

Also Read: Oneplus Nord Ce 3 5G Price: అమెజాన్‌లో సగం ధరకే Oneplus Nord Ce 3 5G మొబైల్‌..అదనంగా రూ.18,900 తగ్గింపు..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News