Bigg Boss Urfi Javed : బిగ్ బాస్ బ్యూటీకి చిక్కులు.. మితి మీరిన శృంగారగీతం.. ఉర్ఫీ జావెద్‌పై ఫిర్యాదు

Bigg Boss Fame Urfi Javed బిగ్ బాస్ బ్యూటీ ఉర్ఫీ జావెద్ ప్రస్తుతం చిక్కుల్లో పడేలా ఉంది. ఆమె చేసిన ఓ ప్రైవేట్ ఆల్బమ్‌లో కొన్ని అభ్యంతరకర పదాలు, సన్నివేశాలున్నాయని ఫిర్యాదు అందిందట.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 27, 2022, 12:28 PM IST
  • నెట్టింట్లో బిగ్ బాస్ బ్యూటీ సందడి
  • అందాల ఆరబోతతో ఉర్ఫీ జావెద్ హల్చల్
  • ప్రైవేట్ ఆల్బమ్‌తో ఉర్ఫీకి చిక్కులు
Bigg Boss Urfi Javed : బిగ్ బాస్ బ్యూటీకి చిక్కులు.. మితి మీరిన శృంగారగీతం.. ఉర్ఫీ జావెద్‌పై ఫిర్యాదు

Bigg Boss Urfi Javed : బిగ్ బాస్ బ్యూటీ ఉర్ఫీ జావెద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బిగ్ బాస్ హిందీ ఓటీటీ మొదటి సీజన్ ద్వారా ఉర్ఫీ ఫేమస్ అయింది. అయితే బిగ్ బాస్ ఇంట్లో ఉన్న సమయంలో కంటే.. బయటకు వచ్చిన తరువాత ఆమె తన వెరైటీ అవుట్ ఫిట్లతో చేసిన రచ్చే ఎక్కువగా అయింది. వెరైటీ దుస్తులు, వెరైటీ డిజైన్లతో ఉర్ఫీ వేసుకున్న బట్టలు మామూలుగా ఉండవు. తన అందాలను చూపించీ చూపించుకుండా అందరికీ మెంటల్ ఎక్కిస్తుంటుంది ఉర్ఫీ జావెద్.

ఎప్పుడూ కెమెరామెన్‌లకు అందుబాటులో ఉంటుంది. అందాలన్నీ ఆరబోసి.. కెమెరా కంటికి కనిపిస్తుంది. ఇక ఉర్ఫీ వెంట కెమెరామెన్లు కూడా పడుతుంటారు. అలా ఉర్ఫీ జావెద్ అందాలకు నెట్టింట్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఆమె ధరించే వింత దుస్తులు అందరినీ నవ్విస్తూనే ఉంటాయి. పనికి రాని చెత్తలు, ముక్కలతోనూ డ్రెస్సులు ధరించగలదు ఉర్ఫీ. అందుకే ఆమె వస్త్రాధారణ అంతగా వైరల్ అవుతుంటుంది.

ఇప్పుడు ఉర్ఫీ జావెద్ ఓ ప్రైవేట్ ఆల్బమ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందులోనూ తన స్టైల్లో కనిపించింది. ఆమె వస్త్రాధారణ కూడా వింతగానే ఉంది. అయితే దీంట్లో ఆమె వాడిన పదజాలం అభ్యంతరకరంగా, అసభ్యకరంగా ఉందంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు అందిందట. మరి దీనిపై ఉర్ఫి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. అసలు రియాక్ట్ అవుతుందా?అన్నది కూడా అనుమానమే.

ఉర్ఫీ జావెద్ బిగ్ బాస్ ఓటీటీ సీజన్‌ చివరి వరకు వచ్చింది. కానీ విజేతగా నిలబడలేకపోయింది. తన మార్క్ చూపిస్తూ చాలా కాలమే బిగ్ బాస్ ఇంట్లో నెట్టుకొచ్చింది. కరోనా సమయంంలో ఉర్ఫీ బాగానే సందడి చేసింది. సోషల్ మీడియా ద్వారా ఉర్ఫీ మరింతగా జనాలకు దగ్గరైంది.

Also Read : Chiranjeevi Godfather Collections : గాడ్ ఫాదర్ రిపోర్ట్ ఇదే.. అన్ని కోట్ల నష్టమా?.. రికవరీ ఇక కష్టమే

Also Read : Dil raju Varisu : నోరు జారిన వంశీ పైడిపల్లి.. దిల్ రాజుకు చిక్కులు.. నిర్మాత ఫైర్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News