Bigg Boss Arohi : అల్లు అర్హ కంటే అద్భుతంగా చేసేవాళ్లు బయట ఉన్నారు.. 'శాకుంతలం'పై బిగ్ బాస్ ఆరోహి రివ్యూ

Bigg Boss Arohi Review బిగ్ బాస్ ఆరోహి తాజాగా శాకుంతలం సినిమా మీద రివ్యూ ఇచ్చింది. అయితే శాకుంతలం సినిమా మీద బయట వచ్చిన రివ్యూలు, నెగెటివ్ టాక్ అందరికీ తెలిసిందే. ఆరోహి మాత్రం వింతగా రివ్యూ ఇచ్చింది. సమంత బాగా నటించలేదని అంటే.. వారంతా కూడా అక్కినేని ఫ్యాన్స్ అయి ఉంటారని చెప్పుకొచ్చింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 19, 2023, 12:10 PM IST
  • బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డ శాకుంతలం
  • సమంతపై దారుణమైన ట్రోలింగ్
  • బిగ్ బాస్ ఆరోహి చెప్పిన రివ్యూ ఇదే
Bigg Boss Arohi : అల్లు అర్హ కంటే అద్భుతంగా చేసేవాళ్లు బయట ఉన్నారు.. 'శాకుంతలం'పై బిగ్ బాస్ ఆరోహి రివ్యూ

Bigg Boss Arohi Review బిగ్ బాస్ బ్యూటీ ఆరోహి సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లోనే ఉంటుంది. రకరకాల ఫోటో షూట్లు చేస్తూ అప్పుడప్పుడు ట్రోలింగ్‌ను కూడా ఎదుర్కొంటుంది. అయితే తాజాగా ఆరోహి తాను చూసిన సమంత శాకుంతలం సినిమా గురించి మాట్లాడింది. తన స్టైల్లో రివ్యూ ఇచ్చింది. ఒక్కో పాయింట్ గురించి వివరగా మాట్లాడింది. తన ఇన్ స్టాలో స్టోరీ పెట్టేసింది.

కొంచెం ల్యాగ్ ఉందని నేను కూడా ఒప్పుకుంటున్నాను.. పురాణాలు తెలిని వాడికి పంచతంత్రం కథలాగే అనిపిస్తది.. సమంత పర్ఫామెన్స్ బాగా లేదన్నోళ్లంతా కూడా చై ఫ్యాన్స్ కన్ఫామ్.. ఉన్నది ఉన్నట్టు తీశారు కదా?.. మసాలా ఏసి మాంచి ఫిక్షన్ యాడ్ చేస్తే చూసేవాళ్లు.. అర్హ చాలా బాగుంది కానీ.. అర్హ కన్నా అద్భుతంగా చేసేవాళ్లు అవకాశాల కోసం చూసేటోళ్లు చాలా మంది ఉన్నారు.. ఓవరాల్‌ యావరేజ్ మూవీ.. ఫ్లాప్ అయితే కాదు.. నా వరకు అంటూ రివ్యూ ఇచ్చింది.

అయితే శాకుంతలం సినిమా రిలీజ్ కాక ముందే నెగెటివ్ టాక్ మూటగట్టుకుంది. పదే పదే వాయిదాలు పడుతూ వస్తుండటంతో.. సినిమా మీద బ్యాడ్ ఇమేజ్ ఏర్పడింది. టీజర్, ట్రైలర్, పాటలు ఏవీ కూడా ఇంపాక్ట్ చూపించలేదు. అయితే శాకుంతలం సినిమాను కాస్త ముందుగానే ప్రీమియర్ వేశారు. అప్పటి నుంచి నెగెటివ్ టాక్ ఎక్కువైంది.

Also Read:  Ileana D'cruz : తల్లి కాబోతోన్న ఇలియానా?.. హీరోయిన్ పోస్ట్‌పై కామెంట్లు.. తండ్రి ఎవరంటూ ట్రోల్స్

ఈ సినిమాకు ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే నెగెటివ్ టాక్ ఎక్కువైంది. దీంతో వీకెండ్ కలెక్షన్ల మీద ప్రభావం గట్టిగా తగిలింది. ఈ సినిమా ఇప్పటి వరకు పది కోట్ల గ్రాస్ గానీ షేర్ గానీ రాబట్టలేకపోతోంది. అయితే సమంతకు ఈ రేంజ్‌ డిజాస్టర్ రావడం మాత్రం చాలా షాకింగ్‌గా అనిపిస్తుంది. ఆమె నటించిన యూటర్న్, ఓబేబీ, యశోదలకు ఓ మోస్తరుగా కలెక్షన్లు వచ్చాయి. హిట్ అయ్యాయి. కానీ శాకుంతలం మాత్రం బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలవబోతోన్నట్టుగా కనిపిస్తోంది.

Also Read: Saif Ali Khan Joins NTR 30 : ఎన్టీఆర్ కోసం రంగంలోకి సైఫ్ ఆలీ ఖాన్.. స్టిల్స్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News