Bigg Boss 5 Telugu: ఊల్ఫ్‌ వర్సెస్‌ ఈగల్‌ టీమ్‌ రచ్చరచ్చ... రెండో వారం నామినేషన్‌ లిస్ట్ రెడీ, ఇంటికెళ్లిపోయేది ఎవరో!

Wolf vs Eagle Team Controversy : రెండో వారానికి సంబంధించి నామినేషన్‌ ప్రక్రియ పూర్తి అయ్యింది.  ఎదుటి టీమ్‌లో ఉన్న సభ్యులను ఎంపిక చేసుకుని వాళ్లు హౌజ్‌లో ఉండటానికి ఎందుకు అర్హులు కారో కారణాలు చెబుతూ వాళ్ల ఫేస్‌కు రెడ్‌ కలర్ పూయమని బిగ్‌బాస్‌ (Bigg Boss) ఆదేశించడంతో సభ్యులంతా రెచ్చిపోయారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 14, 2021, 02:32 PM IST
  • దమ్ముధైర్యం, బుద్ధిబలం ఉన్నవాళ్లు ట్రై చేయండంటూ ఉమా ఛాలెంజ్‌
  • రవితో దోస్తానా వద్దన్న లోబో
  • ఉగ్రరూపం చూపించిన శ్వేత
Bigg Boss 5 Telugu: ఊల్ఫ్‌ వర్సెస్‌ ఈగల్‌ టీమ్‌ రచ్చరచ్చ... రెండో వారం నామినేషన్‌ లిస్ట్ రెడీ, ఇంటికెళ్లిపోయేది ఎవరో!

Bigg Boss 5 Telugu Wolf vs Eagle Team Controversy : బిగ్‌బాస్‌ సీజన్‌ 5 ఫస్ట్ వీక్‌లోనే హీటెక్కింది. ఇక రెండో వారానికి సంబంధించి నామినేషన్‌ ప్రక్రియ పూర్తి అయ్యింది. ప్రస్తుతం ఇంటిలో 18మంది సభ్యులున్నారు. వారంతా ఊల్ఫ్‌, ఈగల్‌ టీమ్‌లుగా విడిపోవాలని బిగ్‌బాస్‌ ఆదేశించడంతో రెండు టీమ్‌లు ఏర్పడ్డాయి.

ఊల్ఫ్‌ టీమ్‌లో రవి, మానస్‌, సన్నీ విజయ్‌, కాజల్‌, శ్వేత వర్మ, లహరి, నటరాజ్‌, జస్వంత్‌, ఉమాదేవిలు ఉండగా.. ఈగల్‌ టీమ్‌లో శ్రీరామ చంద్ర, సిరి, ప్రియాంక, ప్రియ, లోబో, అనీ మాస్టర్‌, హమీదా, విశ్వ,షణ్ముఖ్‌లు ఉన్నారు. అయితే ఇరు టీమ్‌ల మధ్య రచ్చ మాత్రం మామాలుగా జరగలేదు. ఎదుటి టీమ్‌లో ఉన్న సభ్యులను ఎంపిక చేసుకుని వాళ్లు హౌజ్‌లో ఉండటానికి ఎందుకు అర్హులు కారో కారణాలు చెబుతూ వాళ్ల ఫేస్‌కు రెడ్‌ కలర్ పూయమని బిగ్‌బాస్‌ (Bigg Boss) ఆదేశించడంతో సభ్యులంతా రెచ్చిపోయారు. 

దమ్ముధైర్యం, బుద్ధిబలం ఉన్నవాళ్లు ట్రై చేయండి 

ఇక రెండు గ్రూప్‌ల మధ్య వాగ్వాదం ఒక రేంజ్‌లో జరిగింది. శ్వేతవర్మ, ఉమాదేవి, అని మాస్టర్‌, లోబో విశ్వరూపం చూపించారు. ఉమాదేవి ఎవరి బలమేంటో తేల్చుకుందాం రండంటూ సవాలు విసిరింది. 
ఆమె మాటలకు షణ్ముఖ్‌ అవాక్కు అయ్యాడు. యానీ మాస్టర్‌ ఏకంగా ఏడ్చేసింది. దమ్ముధైర్యం, బుద్ధిబలం ఉన్నవాళ్లు నాతో ఆడటానికి ట్రై చేయండి అంటూ ఉమా ఛాలెంజ్‌ చేసింది. ఈ క్రమంలో ఉమాదేవి (uma devi), ప్రియాంకసింగ్‌, యానీ మాస్టర్‌ల మధ్య పెద్ద ఫైటే నడిచింది. 

ప్రియ మంచి కోసం చెప్పినా ...

మొదటగా సిరి.. ఉమాదేవిని, నటరాజ్‌ (Nataraj) మాస్టర్‌ను నామినేట్‌ చేసింది. ఇక నటరాజ్‌ మాస్టర్‌ ఏమో.. ప్రియ మంచి కోసం చెప్పినా తను నన్ను పక్కకు పిలిచి తిట్టేదని, అక్కడ హర్టయ్యాను అంటూ ఆమెను నామినేట్‌ చేశాడు. దీంతో ప్రియ.. మీరు ముందు ఇన్‌ఫ్లూయెన్స్‌ చేయడం ఆపేయండని కౌంటరిచ్చింది. తర్వాత తర్వాత ప్రియాంక సింగ్‌ను నామినేట్‌ చేశాడు నటరాజ్‌. 

పెద్ద పెద్ద హీరోలు గుర్తుపడతరు

మానస్‌.. తాను కెప్టెన్సీ కాకుండా అడ్డుకున్నందుకు లోబోను నామినేట్‌ చేశాడు. దీన్ని సహించలేకపోయిన లోబో కూడా రెచ్చిపోయాడు. తాను ఒక బ్రాండ్‌ అంటూ పెద్ద పెద్ద హీరోలు తనని గుర్తుపడతరు అంటూ చెప్పుకొచ్చాడు. సపోర్ట్‌ చేయాలని పోతే తననే మోసం చేస్తున్నారంటూ మండిపడ్డాడు. ఇక ఆ తర్వాత మానస్‌.. ప్రియకు (Priya) రంగు పూసి నామినేట్‌ చేశాడు.

Also Read : Samantha relationship: నాగచైతన్య Love story trailer ట్వీట్‌కి సమంత రిప్లై

రవితో దోస్తానా వద్దు

తర్వాత విశ్వ.. ఉమాదేవిని నామినేట్‌ చేశాడు. కంటెస్టెంట్లకు కర్రీ లేనప్పుడు నాగార్జున ఇచ్చిన ఆలూ కర్రీ వారికి పెట్టకపోవడం సరికాదంటూ విశ్వ.. ఉమాదేవిని నామినేట్ చేశాడు. ఆ తర్వాత కాజల్‌ను.. విశ్వ నామినేట్‌ చేశాడు. లోబో పని చేయడం లేదంటూ శ్వేతను నామినేట్‌ చేశాడు. రవి (Ravi) తనకు టఫ్‌ కాంపిటీషన్‌ అని అతన్ని కూడా నామినేట్ చేశాడు లోబో. రవితో దోస్తానా వద్దని దండం పెట్టేసి రంగు పూశాడు. 

ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్‌ను పడేసింది

ఇన్ని రోజులు అసలు బిగ్‌బాస్‌ హౌజ్‌లో (Bigg boss house)ఉందో లేదో అన్నట్లుగా ఉన్న శ్వేత వర్మ (swetha varma) తనలోని ఉగ్రరూపం చూపించింది. లోబో కట్టిన ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్‌ను పడేసింది. తన లైఫ్‌లో తనని ఎవరూ సపోర్ట్‌ చేయలేదని చెప్పుకొచ్చింది. ఇక కాజల్‌, ప్రియ లేనప్పుడు వాళ్ల గురించి మాట్లాడావు.. ఇప్పుడేమో సేఫ్‌ గేమ్‌ ఆడుతున్నావంటూ లోబోను తప్పుబట్టింది. అంతేకాదు సెట్‌ శ్వేత లేదని ఎలా అంటావంటూ హమీదాకు గట్టిగానే ఇచ్చింది. 

ఇంటికెళ్లిపోయేది ఎవరో

రెండో వారానికి సంబంధించి ఊల్ఫ్‌ టీమ్‌ నుంచి ఉమాదేవి, నటరాజ్‌, కాజల్‌ నామినేట్‌ అయ్యారు. ఈగల్‌ టీమ్‌ నుంచి లోబో, ప్రియాంక, ప్రియ, అని మాస్టర్‌లు నామినేట్‌ అయ్యారు. మరి ఈ వారం బిగ్‌బాస్‌ హౌజ్‌ (Bigg boss house) విడిచిపెట్టి ఇంటికెళ్లిపోయేది ఎవరో వేచి చూడాలి. ఇక ఇవ్వాల్టి ఎపిసోడ్‌లో అందరూ ఎమోషనల్ అయ్యారు... ఆ ప్రోమోపై కూడా ఒక లుక్కేయండి.

 

Also Read : Ganesh idol immersion:హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై సుప్రీంకోర్టుకు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News