BB Telugu Grand Finale: బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ప్రోమో వచ్చేసింది..ట్విస్ట్ ఏంటంటే..

Bigg Boss 5 Telugu Grand Finale: బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ ఫైనల్ డే వచ్చేసింది. ట్రోఫీ ఎవరి వశం అవుతుందనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. అయితే గ్రాండ్‌ ఫినాలే ఎపిసోడ్ కు సంబంధించిన చిన్న ప్రోమోను రిలీజ్ చేశారు నిర్వాహకులు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 19, 2021, 12:38 PM IST
  • బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ప్రోమో రిలీజ్
  • సాయంత్రం 6 గంటలకు ఫైనల్ ఎపిసోడ్ ప్రసారం
  • ముఖ్య అతిథులుగా టాలీవుడ్, బాలీవుడ్ స్టార్స్
BB Telugu Grand Finale: బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ప్రోమో వచ్చేసింది..ట్విస్ట్ ఏంటంటే..

Bigg Boss 5 Telugu Grand Finale: బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన్‌  ఫైనల్ రోజు వచ్చేసింది. విజేత ఎవరో తెలియడానికి కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో..బిగ్ బాస్(Bigg Boss) నిర్వాహకులు ఫినాలే(Bigg Boss 5 Telugu Grand Finale)కు సంబంధించి చిన్న ప్రోమో రిలీజ్ చేశారు. ఇందులో ఎపిసోడ్‌కి సంబంధించిన మ్యాటర్ ఏమీ లీక్ చేయకుండా జస్ట్ నాగార్జున మాత్రమే ప్రమోషన్ కోసం వచ్చినట్టుగానే ఉంది. సాయంత్రం 6 గంటలకు గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ప్రసారం కానుండగా...దీనికి సంబంధించిన ఏర్పాట్లు భారీ ఎత్తున జరుగుతున్నాయి. 

ఈ ఈవెంట్ కు టాలీవుడ్(Tollywood)తో బాలీవుడ్(Bollywood) సెలబ్రెటీలు కూడా రానున్ననట్లు  సమాచారం.  'బ్రహ్మాస్త్ర' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రణబీర్, అలియాభట్‌(Alia bhatt)లతో రాజమౌళి(Raja Mouli) కూడా రాబోతున్నారని తెలుస్తోంది. శ్యామ్ సింగరాయ్ మూవీ(Shyam Singh Roy Movie) ప్రమోషన్స్ లో భాగంగా..నాని(Hero Nani), సాయిపల్లవి(Sai Pallavi), కృతి శెట్టి సందడి చేయనున్నట్లు సమాచారం. పుష్ప డైరెక్టర్ సుకుమార్ కూడా వస్తున్నట్లు తెలుస్తోంది. 

Also Read: ​BiggBoss Telugu 5 Grand Finale: బిగ్‌బాస్ తెలుగు 5 గ్రాండ్ ఫినాలే అతిధుల జాబితా ఇదే

 

ఇప్పటికే విన్నర్ ఎవరనేది సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. హౌస్ నుంచి ముందుగా సిరి, మానస్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. మిగతా మూడు స్థానాలు కోసం సన్నీ(Sunny), షణ్ముఖ్, శ్రీరామ్ పోటీపడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ ట్రోఫీ ఎవరు గెలుస్తారో తెలియాలంటే..కొంత సమయం వేచి చూడాల్సిందే.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News