Bigg Boss 5 Telugu: శ్రీరామ చంద్ర చేసిన Prize money కామెంట్స్‌పై నెటిజెన్స్ ఫైర్

Bigg Boss 5 Telugu latest updates: బిగ్ బాస్ హౌజ్‌లో ఈ వారం వీకెండ్ ఎపిసోడ్‌లో బిగ్ బాస్ కంటెస్టంట్స్‌ని (Bigg Boss 5 Telugu contestants) పలకరించి ఆడియెన్స్ ముందుకొచ్చే నాగార్జున కంటెస్టంట్స్ వైఖరి గురించి ఏమంటాడు, శ్రీరామ చంద్ర కామెంట్స్‌పై ఎలా స్పందిస్తాడనేదే ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 18, 2021, 05:28 PM IST
  • బిగ్ బాస్ తెలుగు కంటెస్టంట్స్‌లో అందరి కంటే డీసెంట్ అనిపించుకున్న కంటెస్టంట్ ఎవరు ?
  • అదే కంటెస్టంట్‌పై ఆడియెన్స్ అభిప్రాయం ఎందుకు మారిపోయింది ?
  • ఆ కంటెస్టంట్ గురించి ప్రస్తుతం నెటిజెన్స్ ఏమనుకుంటున్నారు ?
Bigg Boss 5 Telugu: శ్రీరామ చంద్ర చేసిన Prize money కామెంట్స్‌పై నెటిజెన్స్ ఫైర్

Bigg Boss 5 Telugu latest updates: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 కంటెస్టంట్స్‌లో కొంతమంది తమ అరుపులతో, కేకలతో రచ్చరచ్చ చేస్తుండగా.. ఫేమస్ సింగర్ శ్రీరామ చంద్ర మాత్రం చాలా హుందాగా, డీసెంట్‌గా వ్యవహరిస్తున్నాడు అనే పేరు తెచ్చుకున్నాడు. కానీ అదంతా ఇటీవల బిగ్ బాస్ కంటెస్టంట్స్‌ని ఈగల్, ఉల్ఫ్ పేరిట రెండు గ్రూపులుగా విడదీయక ముందు కథ. ఎప్పుడైతే బిగ్ బాస్ కంటెస్టంట్స్‌ని పలు టాస్కుల కోసం బిగ్ బాస్ రెండు గ్రూపులుగా విడదీశాడో.. ఆ తర్వాతి నుంచి శ్రీరామ చంద్ర గురించి అప్పటివరకు తమకు ఉన్న అభిప్రాయం మారిపోయిందంటున్నారు కొంత మంది బిగ్ బాస్ తెలుగు ఆడియెన్స్.

బిగ్ బాస్ తెలుగు కంటెస్టంట్స్‌లో అందరి కంటే ఎంతో కూల్ క్యాండిడెట్ అనుకున్న శ్రీరామ చంద్ర కూడా తన గ్రూప్‌కి నాయకత్వం వహించే క్రమంలో ప్రత్యర్థి జట్టుకు చెందిన వారిపై విరుచుకుపడటం, అరవడం, కేకలు వేయడం కనిపించింది. శ్రీరామ చంద్ర భాష కూడా మారిపోయిందంటున్నారు ఇంకొంత మంది ఆడియెన్స్. 

Also read : Sonu Sood Income Tax: సోనూసూద్ రూ.20 కోట్లకు పైగా పన్ను ఎగవేత, దాతల నుంచి సేకరించిన విరాళాలనూ ఖర్చు పెట్టలేదట

అన్నింటికి మించి జరిగిన టాస్క్ గురించి యాంకర్ రవితో (Anchor Ravi) మాట్లాడే క్రమంలో బిగ్ బాస్ రియాలిటీ షోలో గెలిస్తే వచ్చే రూ. 50 లక్షల ప్రైజ్ మనీ కోసం తాను ఇక్కడకు రాలేదని శ్రీరామ చంద్ర (Singer Sriarama Chandra) చెప్పిన విధానాన్ని సైతం పలువురు నెటిజెన్స్ తప్పుపడుతున్నారు. ప్రైజ్ మనీ కోసం రాలేదని శ్రీరామ చంద్ర చెప్పిన తీరులోనే అతడి యాటిట్యూడ్ కనిపిస్తోంది అనేది ప్రస్తుతం అతడిని విమర్శిస్తున్న వారి వాదన. అయితే, అదే సమయంలో ఒక గ్రూప్‌ని రిప్రజెంట్ చేసేటప్పుడు ఆ గ్రూప్‌ని గెలిపించడం కోసం ఆ మాత్రం ఆవేశం చూపించకపోతే ఎలా అని అతడిని వెనకేసుకొచ్చే వాళ్లు కూడా లేకపోలేదు. 

బిగ్ బాస్ హౌజ్‌లో ఈ వారం వీకెండ్ ఎపిసోడ్‌లో బిగ్ బాస్ కంటెస్టంట్స్‌ని (Bigg Boss 5 Telugu contestants) పలకరించి ఆడియెన్స్ ముందుకొచ్చే నాగార్జున కంటెస్టంట్స్ వైఖరి గురించి ఏమంటాడు, శ్రీరామ చంద్ర కామెంట్స్‌పై ఎలా స్పందిస్తాడనేదే ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. మొత్తానికి మొన్నమొన్నటివరకు డీసెంట్ కంటెస్టంట్‌గా పేరు తెచ్చుకున్న శ్రీరామ చంద్ర ఇప్పుడిలా అనూహ్యంగా సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. మరి నాగ్ (Nagarjuna) స్పందన ఏంటో తెలియాలంటే ఈ వీకెండ్ ఎపిసోడ్ పూర్తయ్యేంత వరకు వేచిచూడాల్సిందే.

Also read : Kajal Aggarwal Pregnancy Rumours: తల్లి కాబోతున్న కాజల్ అగర్వాల్..? త్వరలోనే సినిమాలకు గుడ్ బై..??

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News