Bigg Boss: బిగ్‌బాస్ అభిజీత్‌కు బంపర్ ఆఫర్..ఎఫ్ 3లో ఆ పాత్రకు ఎంపిక ?

Bigg Boss: వెంకటేశ్, వరుణ్‌తేజ్ కాంబినేషన్‌లో వచ్చిన ఎఫ్ 2 సీక్వెల్ రూపొందుతోంది. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఎఫ్ 3లో కూడా అదే కాంబినేషన్ కన్పించనుంది. అదనంగా బిగ్‌బాస్ కంటెస్టెంట్‌కు ఆఫర్ వచ్చినట్టు సమాచారం.

Last Updated : Dec 29, 2020, 06:46 PM IST
Bigg Boss: బిగ్‌బాస్ అభిజీత్‌కు బంపర్ ఆఫర్..ఎఫ్ 3లో ఆ పాత్రకు ఎంపిక ?

Bigg Boss: వెంకటేశ్, వరుణ్‌తేజ్ కాంబినేషన్‌లో వచ్చిన ఎఫ్ 2 సీక్వెల్ రూపొందుతోంది. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఎఫ్ 3లో కూడా అదే కాంబినేషన్ కన్పించనుంది. అదనంగా బిగ్‌బాస్ కంటెస్టెంట్‌కు ఆఫర్ వచ్చినట్టు సమాచారం.

దిల్‌రాజు ( Dil Raju ) నిర్మిస్తున్న ఎఫ్ 3 సినిమా ( F3 movie )లో కూడా ఎఫ్ 2 కాంబినేషన్ వెంకటేశ్, వరుణ్ తేజ్, మెహ్రీన్ పీర్‌జాదా, తమన్నాలు కన్పించనున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి ( Director Anil Ravipudi ) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఎఫ్ 3లో మరో నటుడు కూడా కన్పించనున్నాడని తెలుస్తోంది. బిగ్‌బాస్  తెలుగు 4 విజేత ( Bigg Boss Telugu 4 Winner ) గా నిలిచిన అభిజీత్‌కు ఇప్పుడు క్రేజ్ బాగా పెరిగింది. క్రేజ్‌తో పాటు అభిమానులు కూడా ఎక్కువయ్యారు. బిగ్‌బాస్  టైటిల్ పోరులో అఖిల్‌తో పోటీ పడి గెలిచిన తరువాత అభిజీత్ ( Abhijeet ) ‌కు దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఎఫ్ 3లో కీలకమైన రోల్ కోసం ఆఫర్ వచ్చినట్టు వార్త షికారు చేస్తోంది. దీనిపై అధికారికంగా ప్రకటన రాలేదు కానీ..దాదాపుగా అభిజీత్ కీలక రోల్ కోసం ఆఫర్ ఖరారైనట్టు తెలుస్తోంది. 

Also read: Monal Gajjar: బిగ్‌బాస్ కంటెస్టెంట్ మోనాల్ డిమాండ్ మామూలుగా లేదుగా

Trending News