Bhola Shankar First Look: భోళాశంకర్​లో చిరంజీవి ఫస్ట్ లుక్​- మాస్​ లుక్​లో బాస్​!

Bhola Shankar First Look: చిరంజీవి హీరోగా.. మెహర్ రమేశ్​ దర్శకత్వంలో వస్తున్న మూవీ భోళాశంకర్​. ఈ మూవీలో చిరంజీవి ఫస్ట్​ లుక్​ విడుదల చేసింది చిత్ర యూనిట్​. ఇందులో చిరు లుక్​ ఎలా ఉందంటే..

Last Updated : Mar 1, 2022, 11:52 AM IST
  • భోళా శంకర్​ నుంచి బిగ్​ అప్​డేట్​
  • శివరాత్రి సందర్భంగా ఫ్యాన్స్​కు గుడ్​ న్యూస్​
  • చిరంజీవి ఫస్ట్ లుక్ విడుదల
Bhola Shankar First Look: భోళాశంకర్​లో చిరంజీవి ఫస్ట్ లుక్​- మాస్​ లుక్​లో బాస్​!

Bhola Shankar First Look: మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్​కు గుడ్​ న్యూస్​. శివరాత్రి సందర్భంగా చిరు నటిస్తున్న భోళా శంకర్ మూవీ నుంచి అప్​డేట్​ ఇచ్చింది చిత్ర యూనిట్​. సినిమాలో చిరంజీవి ఫస్ట్​లుక్​ను తాజాగా విడుదల చేసింది.

ఫస్ట్​లుక్​ ఎలా ఉంది?

సినిమా ఫస్ట్​లుక్​లో చిరంజీవి సరికొత్త గెటప్​లే కనిపించారు. జీప్ ముందు ఉండే బంపర్​పై కూర్చిని.. చేతి వేలితో త్రిషూలం ఉన్న చైన్​ను తిప్పుతూ ఉంటారు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్.. చిరంజీవి లుక్​ అన్నీ అదిరిపోయాయని చెప్పొచ్చు. ముఖ్యంగా చిరంజీవిని ఈ సినిమాలో యంగ్​ లుక్​లో కనిపిచడం చూస్తే.. సినిమాలో యాక్షన్​ సీన్లకు కొదవే ఉండదని అర్థమవుతోంది.

చాలా గ్యాప్​ తర్వాత మెహర్ రమేష్​ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో.. ఎలాగైనా హిట్టు కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు. అందుకే మెగాస్టార్​ను కొత్తకోణంలో చూపించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు అనిల్ సుంకర నిర్మాత. మహతి స్వర సాగర్  మ్యూజిక్ అందిస్తున్నారు.

నటీనటుల వివరాలు..

ఈ సినిమాలో కీర్తీ సురేశ్​ చిరంజీవి చెల్లెలుగా కనిపించనుంది. తమన్నా, తులసి, రఘు బాబు, రావు రమేష్​, ఉత్తేజ్​, వెన్నెల కిశోర్​, మురళీ శర్మ సహా పలువురు నటిస్తున్నారు. యాక్షన్​తో పాటు కామెడీకి కూడా ప్రాధాన్యత ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ తమిళ సినిమా వేదాళంకు రీమేక్​ అన్న విషయం తెలిసిందే.

Also read: Adipurush Release Date: ప్రభాస్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్.. ఆదిపురుష్ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది!

Also read: Jhol Web Series: ఆ వెబ్‌సిరీస్‌ను పొరపాటున కూడా కుటుంబసమేతంగా చూడవద్దు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News