Bheemla Nayak Song Update: పవర్ స్టార్ ఫ్యాన్స్ కు మరో సర్ ప్రైజ్.. ‘భీమ్లా నాయక్’ నుంచి మరో సాంగ్ అప్డేట్!

Bheemla Nayak Song Update: పవన్ కల్యాణ్ – రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ ‘భీమ్లా నాయక్’ సినిమా నుంచి మరో సర్ ప్రైజ్ వచ్చేసింది. ఈ సినిమాలోని మరో లిరికల్ సాంగ్ ‘అడవి తల్లి మాట’ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. డిసెంబరు 1న పూర్తి సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 30, 2021, 11:50 AM IST
    • భీమ్లా నాయక్ సినిమా నుంచి మరో అప్డేట్
    • సినిమాలోని ‘అడవి తల్లి మాట’ సాంగ్ ను విడుదల ప్రకటన
    • డిసెంబరు 1న విడుదల కానున్న ఫుల్ సాంగ్
Bheemla Nayak Song Update: పవర్ స్టార్ ఫ్యాన్స్ కు మరో సర్ ప్రైజ్.. ‘భీమ్లా నాయక్’ నుంచి మరో సాంగ్ అప్డేట్!

Bheemla Nayak Song Update: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రమోషన్స్ లో జోరును పెంచేసింది. ఇప్పటికే రిలీజ్ అయిన ‘భీమ్లా నాయక్’ టీజర్.. టైటిల్ సాంగ్ తో పాటు ‘లాలా భీమ్లా‘ పాటలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ముఖ్యంగా త్రివిక్రమ్ రాసిన ‘లాలా.. భీమ్లా‘ సాంగ్ కు పవన్ ఫ్యాన్స్ నుంచి విపరీతమైన క్రేజ్ లభిస్తోంది.

ఇప్పుడీ సినిమా నుంచి మరో సాంగ్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ‘అడవి తల్లి మాట’ అనే లిరికల్ ఫుల్ సాంగ్ ను డిసెంబరు 1న ఉదయం 10.08 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. భీమ్లా నాయక్ సినిమాకు సంబంధించిన సారాంశం ఈ పాటలో ఉంటుందని సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. 

సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయతగా పనిచేస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ మ్యూజిక్ ను అందిస్తున్నారు.  

మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాకు తెలుగు రీమేక్ గా ‘భీమ్లా నాయక్’ తెరకెక్కుతోంది. మలయాళ సినిమాలో పోలీసు ఆఫీసర్ గా బిజూ మేనన్ నటించగా.. ఆ పాత్రలో పవన్ కల్యాణ్ పోషిస్తున్నాడు. మరో కీలక పాత్ర పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలో రానా దగ్గుబాటి నటించారు. వీరితో పాటు పవన్ సరసన నిత్యా మేనన్.. రానా పక్కన సంయుక్త మేనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Also Read: Shiva Shankar Master: శివ శంకర్ మాస్టర్ అంత్యక్రియలు పూర్తి... పాడె మోసిన యాంకర్‌ ఓంకార్‌..

ALso Read: Pushpa Trailer Launch: ‘పుష్ప’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ఛీఫ్ గెస్ట్ గా ప్రభాస్?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News