Bengali Actress Arrested: పర్స్​లు కొట్టేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన నటి.. విచారణలో విస్తుపోయే నిజాలు..

Bengali Actress Arrested:  బెంగాలీ నటి రూపా దత్​ను పోలీసులు అరెస్ట్​ చేశారు. కోల్​కతాలో జరుగుతున్న ఇంటర్నేషనల్‌ బుక్ ఫెయిర్‌లో ఆమె దొంగతనం చేయడమే ఇందుకు కారణం.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 13, 2022, 08:09 PM IST
Bengali Actress  Arrested: పర్స్​లు కొట్టేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన నటి.. విచారణలో విస్తుపోయే నిజాలు..

Bengali Actress  Arrested For Stealing Purses At Kolkata Book Fair: కోల్​కతాలో జరుగుతున్న ఇంటర్నేషనల్‌ బుక్ ఫెయిర్‌లో (International Kolkata Book Fair)  దొంగతనం చేసినందుకు బెంగాలీ  నటి రూపా దత్​ను (Actress Rupa Dutta) పోలీసులు అరెస్ట్​ చేశారు. ఎంతో చాకచక్యంగా బాధితుల దృష్టి మరల్చి.. వారి పర్సులను కొట్టేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇలా కొట్టేసిన పర్సులను  చెత్త కుండీలో వేయడం చూసిన ఉత్తర బిధాన్​నగర్​ పోలీసు అధికారి అమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను విచారించగా.. దీంతో అసలు విషయం బయట పడింది.

పోలీసుల అడిగిన ప్రశ్నలకు నటి పొంతన లేని సమాధానాలు చెప్పడంతో వారికి సందేహం కలిగి..ఆమె బ్యాగ్ ను తనిఖీ చేశారు. అందులో రూ. 75 వేల నగదుతో పాటు చాలా పర్స్​లు కూడా ఉన్నట్లు వారు గుర్తించారు. అయితే ఒక నటి అయి ఉండి.. ఆమెకు దొంగతనం (Theft) చేయాల్సిన అవసరం ఏమెుచ్చిందో వారికి అర్థం కాలేదు. ఈ నేరంతో నటి రూపకు మాత్రమే సంబంధం ఉందా లేక దీని వెనుక ఎవరు అయినా ఉన్నారా అనే కోణాలలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రూపా దత్​ బెంగాలీలో కొన్ని సీరియల్స్​లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. గతంలో చిత్ర నిర్మాత అనురాగ్ కశ్యప్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన వారిలో రూపా దత్తా కూడా ఒకరు.

Also Read: Kalyani Priyadarshan Pics: కల్యాణి కుర్రాళ్ల ఊహల రాణి.. ఇంత అందం ఏంట్రా బాబు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News