Bengali Actress Death: 72 గంటల్లో మరో నటి ఆత్మహత్య.. బెంగాలీ సినీ పరిశ్రమలో ఏం జరుగుతోంది?

Bengali Actress Death: బెంగాలీ సినీ పరిశ్రమలో వరుస ఆత్మహత్యలు సినీ ప్రముఖులను కలవరానికి గురిచేస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలో ముగ్గురు నటీమణులు ఆత్మహత్య చేసుకోవడం వెనుక కారణం ఏంటని ఆశ్చర్యానికి లోనవుతున్నారు. అయితే తాజాగా ప్రముఖ మోడల్ మంజుషా నియోగి ఉరి వేసుకొని మరణించారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 27, 2022, 04:40 PM IST
Bengali Actress Death: 72 గంటల్లో మరో నటి ఆత్మహత్య.. బెంగాలీ సినీ పరిశ్రమలో ఏం జరుగుతోంది?

Bengali Actress Death: బెంగాలీ నటి బిదిషా డి మజుందర్ ఆత్మహత్య చేసుకున్న 72 గంటల్లోనే మరో నటి సూసైడ్ చేసుకుంది. ప్రముఖ బెంగాలీ మోడల్ మంజుషా నియోగి కోల్‌కతాలోని తన అపార్ట్‌మెంట్‌లో శుక్రవారం ఉరి వేసుకొని చనిపోయినట్లు ఉంది. అయితే మంజుషాది.. హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఆమె కుటుంబంతో కలిసి పటులి ప్రాంతంలో ఉండేదని పోలీసులు ఆరా తీశారు. 

అంతకుముందు గురువారం (మే 26) బెంగాలీ నటి బిదిషా డి మజుందర్ (21) ఆత్మహత్య చేసుకున్నారు. కోల్ కతా లోని తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మోడల్ గా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన మజుందర్.. 2021లో విడుదలైన భార్-ది క్లౌన్ అనే షార్ట్ ఫిల్మ్‌తో నటిగా మారింది. 

అయితే బిదిషా డి మజుందర్, మంజుషా నియోగి ఆత్మహత్యలకు ఒకదానికొకటి సంబంధం ఉందా? లేదా యాదృఛ్ఛికమా? వీరి ఆత్మహత్యల వెనుక కారణమేంటనే దాని పోలీసులు విచారణ చేపట్టారు. 

వీరిద్దరి కంటే ముందు మే 16న బెంగాలీ మోడల్ నటి పల్లబి డే (21) దక్షిణ కోల్‌కతాలోని తన అద్దె అపార్ట్మెంట్లో ఉరి వేసుకుని మరణించింది. నటిగా 'కుంజా ఛాయా', 'రేషమ్ ఝపి'తో పాటు ఇటీవలే విడుదలైన 'మోన్ మనే నా' వంటి అనేక బెంగాలీ చిత్రాల్లో ఆమె ప్రధాన పాత్ర పోషించారు. 

Also Read: Aryan Khan Case: క్రూజ్ నౌక డ్రగ్స్‌ కేసులో కీలక మలుపు..ఆర్యన్‌కు అందుకే ఊరట లభించిందా..?

Also Read: F3 Movie Review: 'ఎఫ్ 3' మూవీ రివ్యూ.. అధ్యక్ష్యా!! అనిల్ రావిపూడి మూవీ అంటే మినిమమ్ ఇట్టా ఉండాలా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News