BellamKonda Ganesh:మోక్షజ్ఞ తాత, తండ్రి పేరు నిలబెడతాడు.. చిన్న బెల్లంకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

BellamKonda Ganesh on Mokshagna: మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ గురించి బెల్లంకొండ సురేష్ చిన్న కొడుకు హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ సాయి గణేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన అంశం హాట్ టాపిక్ అవుతోంది.   

Written by - Chaganti Bhargav | Last Updated : May 31, 2023, 07:30 PM IST
BellamKonda Ganesh:మోక్షజ్ఞ తాత, తండ్రి పేరు నిలబెడతాడు.. చిన్న బెల్లంకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

BellamKonda Ganesh comments on Mokshagna: నందమూరి అభిమానులందరూ అత్యంత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న విషయం ఏదైనా ఉందంటే అది నందమూరి బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ తేజ సినీ ఎంట్రీ మాత్రమే. నిజానికి ఆయన చాలా కాలం క్రితమే హీరోగా ఎంట్రీ ఇవ్వాల్సింది కానీ పలు కారణాలతో ఆ విషయం వాయిదా పడుతూ వస్తోంది.

అయితే తాజాగా మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ గురించి బెల్లంకొండ సురేష్ చిన్న కొడుకు హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ సాయి గణేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. నిజానికి బెల్లంకొండ సాయి గణేష్ ఇప్పటికే హీరోగా ఒక సినిమా చేయగా రెండవ సినిమా రిలీజ్ కి సిద్ధమైంది. ముందుగా ఆయన సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో స్వాతిముత్యం అనే సినిమాతో హీరోగా లాంచ్ అవ్వగా ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు నేను స్టూడెంట్ సార్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

Also Read: Guntur Kaaram: 'గుంటూరు కారం'తో ఘాటెక్కిస్తున్న మహేష్ బాబు

సాయి గణేష్ అవంతిక దాసాని జంటగా ఈ సినిమా తెరకెక్కగా డైరెక్టర్ తేజ శిష్యుడు రాఖీ ఉప్పలపాటి ఈ సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తున్న సమయంలో తాను నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ మంచి ఫ్రెండ్స్ అని గణేష్ బయట పెట్టాడు. తాము చాలా క్లోజ్ గా ఉంటామని ఇద్దరం కలిసి సినిమాలు కూడా చూసే వాళ్ళం అని చెప్పుకొచ్చారు.

ఒకసారి రచ్చ సినిమాకు వెళ్లి చూస్తుంటే వెనకనుంచి మమ్మల్ని కొంత మంది ప్రేక్షకులు చూసి గుర్తుపట్టారు, రాంచరణ్ సినిమాకి బాలకృష్ణ కొడుకు వచ్చాడురా అంటూ అరిచారు అప్పుడు ఇద్దరం చాలా సరదాగా ఫీలయ్యామని చెప్పుకొచ్చాడు. ఇక త్వరలోనే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఉంటుందని ప్రస్తుతానికి ఫుల్ లెంత్ ప్రిపరేషన్ లో ఉన్నాడని చెప్పుకొచ్చారు. మోక్షజ్ఞ మంచి యాక్టర్ అవుతాడని.. ఆయన కనురెప్పల తోనే నటిస్తాడంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అంతేకాక డాన్స్ కూడా అద్భుతంగా చేస్తాడని తండ్రి పేరు తాత పేరు కూడా నిలబెడతాడని ఈ సందర్భంగా సాయి గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Also Read: Vijay Devarakonda Samantha : టర్కీలో ఖుషీ టీం.. విజయ్ అలా సమంత ఇలా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

 
 

Trending News