Bandla Ganesh Audio Leak : ఆ వాయిస్ నాదే.. త్రివిక్రమ్‌ని తిట్టింది నేనే.. ఒప్పేసుకున్న బండ్ల గణేష్

Bandla Ganesh On Audio Leak బండ్ల గణేష్ ఎప్పుడు ఎలా మాట్లాడుతాడో ఎవ్వరూ అంచనా వేయలేదు. ఒక్కోసారి తాను మాట్లాడిన మాటలనే తప్పు అని తెలుసుకుంటాడు. క్షమాపణలు చెబుతుంటాడు. తాజాగా అలాంటి ఓ ఘటనే జరిగింది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 3, 2022, 10:43 AM IST
  • బండ్ల గణేష్ ఆడియో లీక్
  • త్రివిక్రమ్‌పై బండ్లన్న తిట్లు
  • ఒప్పుకున్న బడా నిర్మాత
Bandla Ganesh Audio Leak : ఆ వాయిస్ నాదే.. త్రివిక్రమ్‌ని తిట్టింది నేనే.. ఒప్పేసుకున్న బండ్ల గణేష్

Bandla Ganesh Audio Leak :  బండ్ల గణేష్ మాటలకు, పవన్ కళ్యాణ్‌ గురించి బండ్లన్న ఇచ్చే స్పీచుకు సపరేట్ క్రేజ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్‌ గురించి బండ్లన్న చెప్పినట్టుగా, పొగిడినట్టుగా ఇంకెవ్వరూ మాటల తూటాలు పేల్చలేరు. ఆయన మాటలు వింటుంటే.. ఓ హై వచ్చేస్తుంది. నరనరాలను ఉత్తేజపరిచేట్టుగా ఉంటుంది. బండ్లన్న స్పీచు నడుస్తున్న సమయంలో స్టేజ్ మొత్తం దద్దరిల్లిపోవాల్సిందే. ఇక బండ్లన్న ఇచ్చే స్పీచు కోసం పవన్ కళ్యాణ్ ఈవెంట్లకు వచ్చే అభిమానులు కూడా ఉంటారు.

అయితే భీమ్లా నాయక్ సమయంలో మాత్రం కాస్త తేడా కొట్టేసింది. వకీల్ సాబ్ ఈవెంట్లో బండ్లన్న స్పీచ్ ఎఫెక్ట్ బాగానే పని చేసింది. పవన్ కళ్యాణ్ స్పీచ్ కంటే.. బండ్లన్న ప్రసంగానికే నాడు ఎక్కువ మార్కులు పడ్డాయి. దీంతో భీమ్లా నాయక్ ఈవెంట్‌కు బండ్లన్నను దూరం పెట్టేశారట. భీమ్లా నాయక్ ఈవెంట్ కోసం బండ్లన్న స్పీచ్ రెడీ చేసుకున్నాడట. తన దేవుడిని పొగిడేందుకు కొన్ని లైన్స్ రాసుకున్నాడట. కానీ చివర్లో త్రివిక్రమ్ ట్విస్ట్ ఇచ్చాడట.

త్రివిక్రమ్ తనను ఈవెంట్‌కు పిలవొద్దని అన్నాడట. బండ్ల గణేష్ వస్తే.. స్పీచ్ ఇస్తే తన ప్రభావం అంతగా ఉండకపోవచ్చని త్రివిక్రమ్ అనుకున్నాడట. అందుకే తనను ఈవెంట్‌కు పిలవలేదని, వాడు వీడూ అంటూ త్రివిక్రమ్‌ను నానా రకాలుగా తిట్టేశాడు బండ్ల గణేష్. ఈ మేరకు ఓ ఆడియో ఫైల్ వైరల్ అయింది. అప్పుడు అయితే అది తన వాయిస్ కాదని బండ్లన్న బుకాయించాడు. కానీ ఇప్పుడు అది తన వాయిసే అని ఒప్పేసుకున్నాడు.

 

ఆ వాయిస్ నాదే.. త్రివిక్రమ్‌ని తిట్టింది నేనే.. ఆ తరువాత సారీ కూడా చెప్పా అంటూ కుండ బద్దలు కొట్టేసినట్టుగా చెప్పేశాడు బండ్ల గణేష్. దాంట్లో భయపడేది ఏముందన్నట్టుగా మాట్లాడేశాడు. అయితే బండ్ల గణేష్ రాని భీమ్లా నాయక్ ఈవెంట్‌లో.. త్రివిక్రమ్ కూడా మాట్లాడలేదు. అసలు ఆ ఈవెంట్‌కు త్రివిక్రమ్ వచ్చాడా? లేదా? అన్నట్టుగా మారిపోయింది. నాటి ఈవెంట్లో త్రివిక్రమ్ ఎక్కడా కూడా కనిపించలేదు. అయితే త్రివిక్రమ్ స్పీచ్ ఎలా ఉంటుంది.. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెబుతాడా? అని ఎదురుచూసిన అభిమానులకు మాత్రం నిరాశే మిగిలింది.

ఇక ఇప్పుడు బండ్ల గణేష్ తన ఆడియో ఫైల్ మీద స్పందించడంతో మరోసారి నాటి సంగతులు వైరల్ అవుతున్నాయి. నాటి వీడియో మీద చర్చలు జరుగుతున్నాయి. అందుకే మధ్య బండ్లన్న తన ఇంట్లోని పవన్ కళ్యాణ్‌ ఫోటోలను తీసి తన తల్లిదండ్రుల ఫోటోలను పెట్టుకున్నాడా? అని చర్చించుకుంటున్నారు నెటిజన్లు.

Also Read : తెలుగులో ఉన్న సినిమాని రీమేక్ చేయడానికి పిచ్చోళ్లేమీ కాదు.. మాస్టర్ ప్లాన్ వేరే ఉందం

Also Read : Rajamouli Brother Kanchi Comments: పౌరాణికం తీస్తే తెలుగోడే తీయాలి..పొన్నియన్, ఆదిపురుష్ లకు జక్కన్న బ్రదర్ కౌంటర్?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News