Akhanda title song teaser: అఖండ టైటిల్ సాంగ్ టీజర్ వచ్చేస్తోంది

Akhanda title song teaser: అఖండ టీజర్ ఇప్పటికే 57 మిలియన్ వ్యూస్‌తో ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతుండగా తాజాగా అఖండ టైటిల్ సాంగ్ సైతం ఆడియెన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 3, 2021, 07:30 PM IST
Akhanda title song teaser: అఖండ టైటిల్ సాంగ్ టీజర్ వచ్చేస్తోంది

Akhanda title song teaser: బాలయ్య బాబు హీరోగా బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్న అఖండ మూవీ టీజర్ ఇటీవలే విడుదలై సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. అఖండ టీజర్ ఇప్పటికే 57 మిలియన్ వ్యూస్‌తో ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతుండగా తాజాగా అఖండ టైటిల్ సాంగ్ సైతం ఆడియెన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది. అందులో భాగంగానే అభిమానులకు దీపావళి కానుకగా అఖండ టైటిల్ సాంగ్ టీజర్‌ను దీపావళి నాడు ఉదయం 11:43 గంటలకు విడుదల చేస్తోంది. 

అఖండ మూవీ టైటిల్ సాంగ్ నవంబర్ 8న ఆడియెన్స్ ముందుకు రానుంది. అయితే, అంతకంటే ముందుగా రేపు పండగ నాడు టైటిల్ సాంగ్ టీజర్ (Akhanda title song teaser) రానుందన్నమాట. దీంతో ప్రస్తుతం బాలయ్య బాబు అభిమానుల ఫోకస్ అంతా టీజర్‌పైనే ఉంది. 

Also read : Ram Charan: పునీత్ రాజ్‌కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన రామ్ చరణ్

బాలయ్య బాబుతో పాటు (Balayya Babu) ఈ సినిమాలో శ్రీకాంత్, జగపతి బాబు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna latest updates) సరసన ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా విడుదల తేదీ విషయంలోనే ఇంకా సరైన క్లారిటీ లేదు.

Also read : Major making video: అడివి శేష్ నటిస్తున్న మేజర్ బయోపిక్ మేకింగ్ వీడియో

Also read : Sarkaru Vaari Paata Release Date: వేసవిలో రానున్న ‘సర్కారు వారి పాట’.. రిలీజ్‌ డేట్ మారింది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News