Veera Simha Reddy Collection : కలెక్షన్లలో నిజమెంత ఉంది.. వీరయ్య, వీర వసూళ్ల పోస్టర్ల మీద చర్చలు

Veera Simha Reddy Collection సంక్రాంతి రేసులో వీర సింహా రెడ్డి కాస్త వెనకపడిన సంగతి తెలిసిందే. కానీ కలెక్షన్ల పోస్టర్లు మాత్రం భిన్నంగా ఉంటున్నాయి. వీరయ్య దూసుకుపోతోంటే.. వీర సింహా రెడ్డి కలెక్షన్ల పోస్టర్లు సైతం దుమ్ములేపేస్తున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 17, 2023, 11:47 AM IST
  • సంక్రాంతికి కళకళలాడిన బాక్సాఫీస్
  • బరిలో చిరంజీవి వర్సెస్ బాలయ్య
  • ఫేక్ కలెక్షన్ల పోస్టర్లపై నెట్టింట్లో చర్చలు
Veera Simha Reddy Collection : కలెక్షన్లలో నిజమెంత ఉంది.. వీరయ్య, వీర వసూళ్ల పోస్టర్ల మీద చర్చలు

Waltair Veeraya Overseas Collection మన టాలీవుడ్‌లోనే కాకుండా అన్ని చోట్ల ఈ ఫేక్ కలెక్షన్ల, తప్పుడు రికార్డులతో హీరోలను, అభిమానులను మాయ చేస్తుంటారు. కొందరేమో ఈ కలెక్షన్ల పోస్టర్లకు వ్యతిరేకంగా ఉంటే.. కొంత మంది హీరోలేమో వాటినే గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఇప్పుడు సంక్రాంతి బరిలో దిగిన నాలుగు సినిమాల లెక్కల వివరాలు ఇప్పుడు అందరినీ ఆలోచనలో పడేస్తున్నాయి.

లోకల్‌ మార్కెట్, కలెక్షన్లను అంచనా వేయడం చాలా కష్టం. కానీ ఓవర్సీస్ లెక్కలు మాత్రం చాలా పక్కగా ఉంటాయి. ఓవర్సీస్‌ కలెక్షన్లను అంచనా వేసి సినిమా హిట్టా? బ్లాక్ బస్టరా? ఫట్టా అనే విషయాన్ని చెప్పొచ్చు. అక్కడ మినిమం వన్ మిలియన్ డాలర్ కలెక్ట్ చేసిందంటే చాలు ఆ సినిమాను హిట్టుగా పరిగణించవచ్చు. జరిగిన బిజినెస్‌తో పోల్చి చూసి, వచ్చిన కలెక్షన్లు చూస్తే సినిమా ఏ స్థితిలో ఉందో చెప్పుకోవచ్చు.

బాలయ్య వీర సింహా రెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య విషయంలో మొదటి నుంచి ఓవర్సీస్ టార్గెట్, బ్రేక్ ఈవెన్ సంఖ్యలు మారుతూ వస్తున్నాయి. వాల్తేరు వీరయ్య కంటే ఒక రోజు ముందుగానే వీర సింహా రెడ్డి బరిలోకి దిగింది. అయినా కూడా కలెక్షన్లలో మాత్రం భారీ తేడా ఉంది. వీరయ్య లేటుగా బరిలోకి దిగాడు. కానీ కలెక్షన్లలో మాత్రం ముందున్నాడు. వాల్తేరు వీరయ్య రెండు మిలియన్ల డాలర్లకు దగ్గర్లో ఉంటే.. వీర సింహా రెడ్డి మాత్రం వన్ మిలియన్ డాలర్ వద్దే ఉన్నాడు.

ఓవర్సీస్‌లోనే అంత భారీ తేడా ఉంటే.. లోకల్‌గా ఇంకెంత తేడా ఉండాలనే మెగా ఫ్యాన్స్ అనుమానం. కానీ వెంట వెంటనే వంద కోట్ల పోస్టర్లు వేసుకుంటూ వెళ్లడంతో అందరిలోనూ అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. మన దగ్గర పరిస్థితి ఇలా ఉంటే తమిళ నాట ఇంకోలా ఉంది. అసలు అక్కడ ఏ సినిమాకు ఎన్ని కలెక్షన్లు వచ్చాయి.. ఏది నిజమో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. తునివు, వారిసు సినిమాల లెక్కలు గందరగోళంగా మారాయి. ఇప్పటికైతే వారిసు రూ. 150 కోట్ల గ్రాస్ రాబట్టినట్టు పోస్టర్లు వెలిశాయి.

Also Read:  Veera Simha Reddy Break even : మరీ ఇంత దారుణమా?.. చిరు మీద ఇంత కక్షా?.. బాలయ్య మీద అంత ప్రేమనా?

Also Read: Chiranjeevi : సెట్‌కు వెళ్లే ముందు ఇంట్లో వంట మనిషితో.. ఆసక్తికరమైన విషయాన్ని చెప్పిన చిరంజీవి 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News