Balakrishna to Take over Taraka Ratna Family Responsibility: తారకరత్న పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నాడు అనే సంగతి దాదాపు రెండు మూడు రోజుల నుంచి వైరల్ అవుతుంది. ఆయన మరణ వార్త ఎప్పుడైతే తెరమీదకు వచ్చిందో ఆయన పర్సనల్ విషయాలు మీద కూడా ప్రజలందరూ దృష్టి పెడుతున్నారు. వాస్తవానికి తారకరత్న పెద్దలు చూసిన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోలేదు. తారకరత్న హీరోగా నందీశ్వరుడు అనే సినిమాలో నటిస్తున్న సమయంలో ఆ సినిమాకి అలేఖ్య రెడ్డి అనే యువతీ కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసేది.
ఆమెతో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీయడంతో ఆమెనే వివాహం చేసుకోవాలని తారకరత్న నిర్ణయం తీసుకున్నాడు. అయితే వాస్తవానికి అలేఖ్య రెడ్డి అప్పటికే ఒకసారి వివాహం చేసుకొని మనస్పర్థల కారణంగా విడిపోయింది. నల్గొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి కుమారుడు ప్రస్తుత జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డిని ఆమె ముందుగా వివాహం చేసుకున్నారు. అయితే వారిద్దరికీ పసగక పోవడంతో తర్వాత విడాకులు తీసుకుని ఆమె కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసేది.
ఆ సమయంలో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో ఇద్దరు ఇళ్లలో తమ ప్రేమ వ్యవహారాన్ని చెప్పారు. కానీ ఇద్దరి ఇళ్లలో వారి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కొన్నాళ్లపాటు వేచి చూసిన ఈ జంట ఇక వీరి మనసులు కరిగేలా లేవని భావించి హైదరాబాద్ శివారులోని సంఘీ టెంపుల్ లో రహస్యంగా ప్రేమ వివాహం చేసుకొని కొత్త కాపురం పెట్టారు. అయితే వీరి వివాహానికి నందమూరి తారకరత్న కుటుంబం నుంచి అలేఖ్య రెడ్డి కుటుంబం నుంచి కూడా ఏ మాత్రం మద్దతు లభించలేదు. దీంతో వారు స్వయంగా తారకరత్న సినిమాలు చేసుకుంటూ ఆమె కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తూ తమను తామే పోషించుకుంటూ వచ్చారు.
ముందుగా వారికి ఒక కుమార్తె జన్మించగా ఆమెకు నిష్క అనే పేరు పెట్టారు. తరువాత కవలలు జన్మించారు వారిలో ఒకరు పాప కాగా మరొకరు బాబు. అలా ముగ్గురు సంతానానికి ఈ జంట తల్లిదండ్రులు అయ్యారు. ఇలాంటి నేపథ్యంలో తారకరత్న కన్నుమూయడంతో అలేఖ్య రెడ్డికి ఏం చేయాలో పాలుపోలేదు. తన భవిష్యత్తు ఏమిటి? తన పిల్లల భవిష్యత్తు ఏమిటి? అనే విషయం మీద బెంగ పెట్టుకున్న ఆమె తారకరత్న మరణించినప్పటి నుంచి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోలేదని తెలుస్తోంది. దీంతో డిహైడ్రేషన్ కి గురై ఆమె కళ్ళు తిరిగి పడిపోయారు, అక్కడే ఉన్న బాలకృష్ణ వెంటనే రంగంలోకి దిగి ఆమెకు మేమున్నాం అనే మాట ఇచ్చినట్లు తెలుస్తోంది.
మీరు వేరు మేము కాదు మీరు మా కుటుంబంలో ఒకరు మా కుటుంబ సభ్యులను ఎలా చూసుకుంటామో మిమ్మల్ని కూడా అలాగే చూసుకుంటాం ఆందోళన వద్దు అని మాట ఇచ్చినట్లుగా విజయసాయిరెడ్డి వెల్లడించారు. తారకరత్న కుమార్తెల చదువులు, పెళ్లిళ్లు వ్యవహారం తానే చూసుకుంటానని అలాగే తారకరత్న కుమారుడిని ప్రయోజకుడుగా తీర్చిదిద్దే బాధ్యత కూడా తనదేనని బాలకృష్ణ చెప్పినట్లు తెలుస్తోంది. అలేఖ్య రెడ్డి తీవ్ర మానసిక ఒత్తిడికి గురైందని ప్రేమించి ఇన్నాళ్లు కలిసి ఉన్న వ్యక్తి దూరమవ్వడంతో ఆమె అలా అయిపోయిందని బాలకృష్ణ మాట ఇచ్చిన తర్వాత ఆమె కాళ్లు చేతులు వణకడం, ఆందోళన కొంతమేర తగ్గాయని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు.
Also Read: Taraka Ratna Children: తారకరత్నకు కుమార్తె మాత్రమే కాదు.. ఒక వారసుడు కూడా ఉన్నాడు తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook