Balakrishna Free Surgeries in the Memory of Taraka Ratna: నందమూరి బాలకృష్ణకు కుమారుడు వరస అయ్యే నందమూరి తారకరత్న కార్డియాక్ అరెస్టుతో బాధపడుతూ బెంగళూరులోని నారాయణ హృదయాలయ వైద్యాలయంలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణించి నెల రోజులు పూర్తి కావడంతో ఆయన భార్య అలేఖ్య రెడ్డి సోషల్ మీడియాలో తన ఆవేదన వ్యక్తం చేస్తూ పోస్ట్ కూడా పెట్టింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు తన కుమారుడు తారకరత్న మృతి నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
తన బిడ్డ తారకరత్న పేరు మీద కార్డియాక్ సర్జరీ, తోరియాక్ సర్జరీ పేదలకు ఉచితంగా చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తన ఇంట్లో వచ్చిన కష్టం ఎవరికి రాకూడదు అని ఉద్దేశంలో హిందూపురంలో తాను నిర్మించిన హాస్పిటల్ లోని హెచ్ బ్లాక్ కి తారకరత్న పేరు కూడా పెట్టినట్లుగా తెలుస్తోంది. కోటి 30 లక్షలు విలువ చేసే సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ ను అన్నింటిని ఆయన విదేశాల నుంచి తెప్పిస్తున్నారని ఇక్కడ చిన్న పిల్లలకు ఉచిత భోజనంతో పాటు కావాల్సిన మందులు కూడా మూడు నెలల పాటు ఫ్రీగా ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.
వాస్తవానికి ఈ మధ్యకాలంలో కార్డియాక్ అరెస్టు అవుతున్న వ్యవహారాలు ఎక్కువ అవుతున్నాయి. ఎందుకు అవుతుందో? ఎలా అవుతుందో? తెలియదు కానీ చిన్నారులకు సైతం గుండెపోటు రావడం అనే వార్తలు ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. ఈ నేపద్యంలోనే నందమూరి బాలకృష్ణ తాను ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న హిందూపురం ప్రజలందరూ ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో హిందూపురంలోని తాను నిర్మిస్తున్న హాస్పిటల్లో ఈ ఉచిత కార్డియాక్ సర్జరీ అలాగే సర్జరీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
దీంతో నందమూరి బాలకృష్ణ అభిమానులందరూ మా బాలయ్య బంగారం అంటూ కామెంట్లు చేస్తున్నారు. బయట వాళ్ళు ఎన్ని మాట్లాడినా ఏం చేసినా బాలకృష్ణ తాను చేయాలనుకున్న సేవ చేస్తూనే ఉంటారని ఇకనైనా బాలకృష్ణ మీద విమర్శలు మానుకుని కనీసం ఆయన చేస్తున్న సేవలో ఎంతో కొంత చేస్తే పుణ్యం వస్తుందని కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయంలో మీ ఉద్దేశం ఏమిటో కామెంట్ చేయండి.
Also Read: Patna Obscene Video: కొంపముంచిన కక్కుర్తి.. పోర్న్ చూస్తూ రైల్వేస్టేషన్లో అందరికీ చూపించేశాడు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook