Baby Movie: కోలీవుడ్ లో రీమేక్‌ కాబోతున్న బేబీ మూవీ?

Baby Movie:  కంటెంట్‌ను నమ్ముకుని సినిమా తీస్తే ఎంత పెద్ద హిట్ అవుతుందో బేబీ నిరూపించింది. తాజాగా ఈ మూవీని తమిళ్ లో రిలీజ్ చేయబోతున్నట్లు నెట్టింట వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 2, 2023, 08:33 PM IST
Baby Movie: కోలీవుడ్ లో రీమేక్‌ కాబోతున్న బేబీ మూవీ?

Baby Movie: ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్‌ లీడ్ రోల్స్ లో నటించిన బేబీ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. లవ్ అండ్ యూత్ పుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను సాయి రాజేష్‌ దర్శకత్వం వహించాడు. నేటి  జెనరేషన్‌కు తగ్గట్టు మూవీని రూపొందించడంతో.. ఈ చిత్రానికి బాగా కనెక్ట్ అయ్యారు యూత్. చాలా ఏళ్ల తర్వాత థియేటర్లన్నీ హౌస్ పుల్ బోర్డులతో నిండిపోయాయి. ఈ మధ్య కాలంలో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌లకు ఈ స్థాయిలో లాభాలు తెచ్చిపెట్టిన సినిమా మరొకటి లేదు. ఓటీటీలో కూడా ఈ సినిమా ఊహించని రేంజ్ లో ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. ఇందులో వైష్ణవి, ఆనంద్ నటనకు ఫిదా అవ్వని ప్రేక్షకుడంటూ ఎవ్వరూ ఉండరు. ఈ సినిమాపై ప్రముఖులు ప్రశంసల లభించాయి.

పది కోట్లు లోపు బడ్డెట్ తో తెరకెక్కిన ఈ మూవీ 100 కోట్ల మార్కుకు దగ్గరలోకి వచ్చి ఆగిపోయింది. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ హిట్ కొట్టింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చకెర్లు కొడుతోంది.  ఈ సినిమాను తమిళ్‌లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. అంతేకాకుండా ఒరిజినల్‌ వెర్షన్‌ను తెరకెక్కించిన సాయి రాజేషే తమిళ రీమేక్‌ను కూడా చేయబోతున్నారని టాక్. SKNతో కలిసి ఓ తమిళ మీడియా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతుందట. ఇందులో నిజమెంతో తెలియదు కానీ ఈ వార్త సోషల్ మీడియాను ఊపేస్తోంది. కేవలం కంటెంట్‌ను నమ్ముకుని సినిమా తీస్తే ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ అవుతుందో ఈ సినిమా చేసి చూపించింది. 

Also Read: Martin Luther King Teaser: ఇంట్రెస్టింగ్ గా సంపూర్ణేశ్ బాబు‘'మార్టిన్ లూథర్ కింగ్'’ టీజర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  

Trending News