Avatar 2 Box Office Collections : అవతార్ 2 సునామీ.. కలెక్షన్లు చూస్తే కచ్చితంగా షాక్ అవుతార్

Avatar 2 First Weekend Collection అవతార్ ది వే ఆఫ్ వాటర్ సినిమా మొదటి వారాంతంలో దాదాపు మూడు వేల కోట్లు కొల్లగొట్టినట్టు తెలుస్తోంది. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రోజుకు వెయ్యి కోట్లు కొల్లగొట్టేస్తోందన్న మాట.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 19, 2022, 02:03 PM IST
  • దుమ్ములేపుతున్న అవతార్ 2 చిత్రం
  • ప్రపంచ వ్యాప్తంగా 435 మిలియన్ల డాలర్లు?
  • ఇండియాలో మూడు రోజుల్లోనే ఎంత వచ్చిందంటే?
Avatar 2 Box Office Collections : అవతార్ 2 సునామీ.. కలెక్షన్లు చూస్తే కచ్చితంగా షాక్ అవుతార్

Avatar 2 Weekend Collection అవతార్ సినిమా బడ్జెట్ ఎంత... దానికి వచ్చిన కలెక్షన్లు ఎంత అని ఒకప్పుడు అంతా నోరెళ్లబెట్టారు. దాదాపు రెండు వేల కోట్లతో తెరకెక్కిస్తే పది రెట్ల లాభానికి పైగా వచ్చినట్టుంది. అవతార్ సినిమా దాదాపు 29 వేల కోట్లు కొల్లగొట్టినట్టు సమాచారం. అయితే ఇప్పుడు ఆ రికార్డులను అవతార్ ది వే ఆఫ్‌ వాటర్ అవలీలగా క్రాస్ చేసేట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఈ సినిమాకు మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా మూడు వేల ఐదు వందల కోట్లు వచ్చినట్టు తెలుస్తోంది. అన్ని దేశాల్లో అవతార్ 2 మ్యానియా కనిపిస్తోంది. 

ఇక భారత్‌లోనూ ఈ చిత్రం దుమ్ములేపేస్తోంది. మొదటి వారాంతంలోనే ఈ చిత్రం రికార్డ్ కలెక్షన్లు రాబట్టినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు 137.50 కోట్ల షేర్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇక రెండు వందల కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినట్టు సమాచారం. ఎక్కువగా ఇంగ్లీష్‌ భాషలోనే అవతార్‌ను చూసినట్టు తెలుస్తోంది. అందుకే ఇంగ్లీష్‌లో 24 కోట్లు, హిందీలో 14 కోట్లు, తెలుగులో 4 కోట్లు, తమిళంలో 3 కోట్లు, మలయాళంలో 45 లక్షలు వసూలు చేసినట్టు తెలుస్తోంది. 

మొత్తానికి అవతార్ ప్రతీ దేశంలో మార్మోగిపోతోందని అర్థమవుతోంది. ఈ సినిమాకు జేమ్స్ కామరూన్ పెట్టింది 250 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రెండు వేల కోట్లు. ఆ మొత్తం రెండు రోజుల్లోనే వచ్చింది. ఇక ఆల్రెడీ వెయ్యి కోట్ల లాభాన్ని కూడా చూసేశారు. కానీ అవతార్ 2 టార్గెట్ మాత్రం చాలా పెద్దది అన్న సంగతి తెలిసిందే. 

అవతార్ ది వే ఆఫ్ వాటర్ సినిమా ముప్పై వేల కోట్ల వరకు కొల్లగొట్టేలా ప్లాన్ చేస్తున్నాడు జేమ్స్ కామెరూన్. ఇక ఈ చిత్రం దెబ్బకు ప్రతీ చోటా సినిమాలు రిలీజ్ అవ్వాలంటే కాస్త ముందూ వెనకా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వారం తెలుగులో నాలుగు సినిమాలు పోటీలోకి వచ్చేస్తున్నాయి. అవతార్ 2 దెబ్బకు అవి ఎంత వరకు నిలబడతాయో చూడాలి.

Also Read : Samantha Ruth Prabhu : సమంత ఇక సినిమాలకు పూర్తిగా దూరం అవుతుందా?.. ఆ ఒక్కటి మాత్రం పూర్తి చేసేస్తుందట!

Also Read : Anchor Varshini Pics : వెడ్డింగ్ సెలెబ్రేషన్స్.. యాంకర్ వర్షిణి పిక్స్ వైరల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News