Sushant Singh Rajput: అర్జున్ కపూర్‌పై దుమ్మెత్తి పోస్తున్న నెటిజెన్స్

Arjun Kapoor being trolled: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ( Sushant Singh Rajput ) ఆత్మహత్య తరువాత బాలీవుడ్‌లో బంధు పక్షపాతం ( Nepotism )పై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. అందులో భాగంగానే సుశాంత్ సినిమాను అర్జున్ లాగేసుకున్నాడు అంటూ నెటిజెన్స్ ట్రోల్ చేస్తున్నారు.

Last Updated : Jun 24, 2020, 06:17 PM IST
Sushant Singh Rajput: అర్జున్ కపూర్‌పై దుమ్మెత్తి పోస్తున్న నెటిజెన్స్

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ( Sushant Singh Rajput ) ఆత్మహత్య తరువాత బాలీవుడ్‌లో బంధు పక్షపాతం ( Nepotism )పై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. అందులో భాగంగానే సుశాంత్ సినిమాను అర్జున్ లాగేసుకున్నాడు అంటూ నెటిజెన్స్ ట్రోల్ చేస్తున్నారు. చేతన్ భగత్ రాసిన హాఫ్‌ గాళ్‌ఫ్రెండ్ ( Half Girlfriend ) నవల కథ ఆధారంగా 2015లో ఒక సినిమాను తెరకెక్కిద్దాం అనుకున్నారు. మోహిత్ సూరి దర్శకత్వం వహించే ఈ మూవీలో సుశాంత్  సింగ్ రాజ్‌పుత్‌ను హీరోగా ఫైనల్ చేశారు. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ చివరికి అర్జున్ కపూర్ ( Arjun Kapoor ) హీరోగా నిర్ణయించారు. అయితే ఇటీవలే  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తరువాత సినీ పరిశ్రమలో బంధు పక్షపాతంపై తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సుశాంత్‌కు ఓకే అయిన సినిమాలు ఇతర హీరోలకు ఎలా వెళ్లాయో అనే విషయంపై నెటిజెన్లు ( Netigens ) చర్చించుకుంటున్నారు.

అర్జున్ కపూర్ స్టార్ కిడ్ ( Star Kid ) అవడం వల్లే అతనికి ఈ సినిమా అవకాశం వచ్చింది అని... లేదంటే సుశాంత్ నటనకు అర్జున్ నటనకు మధ్య పోలికే ఉండదు అని దుమ్మెత్తి పోస్తున్నారు. అదే సమయంలో అర్జున్ కపూర్ యాక్టింగ్ సామర్థ్యంపై వ్యంగ్యంగా ట్వీట్లు చేస్తున్నారు.

అందులో కొన్నిమీరు కూడా చూడండి.

అయితే కొంత మంది మాత్రం రాబ్తా సినిమా కోసం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హాఫ్ గాళ్ ఫ్రెండ్ సినిమాను కాదన్నాడని కూడా చెబుతున్నారు. ఇందులో ఏది నిజం అనేదే ఆ సినిమా మేకర్సే చెప్పాలి. 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x