Guntur Kaaram: గుంటూరు కారం మూవీ టీమ్‌కు అదిరిపోయే న్యూస్.. ఇక కలెక్షన్ల సునామీ

Guntur Kaaram Ticket Rates: మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా గుంటూరు కారం. జనవరి 12న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టికెట్ రేట్ లో పెంపు కోసం తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సైతం అనుమతి ఇచ్చింది…

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 10, 2024, 10:20 PM IST
Guntur Kaaram: గుంటూరు కారం మూవీ టీమ్‌కు అదిరిపోయే న్యూస్.. ఇక కలెక్షన్ల సునామీ

Guntur Kaaram Ticket Rates in AP: అతడు, ఖలేజా  లాంటి సినిమాల తర్వాత మరోసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా చేస్తున్న సినిమా గుంటూరు కారం. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేస్తుండగా రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఇక మొదటి రోజు ఈ సినిమా కలెక్షన్స్ పరంగా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అని అందరు ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ మధ్యనే తెలంగాణ గవర్నమెంట్ గుంటూరు కారం సినిమాకి గాను టికెట్ల ధ‌ర‌ల‌ను పెంచుకునేందుకు అనుమతి ఇవ్వడం జరిగింది. అలాగే బెనిఫిట్ షోల‌కు సైతం ఈ చిత్రం అనుమ‌తి ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అనుమతి ప్రకారం ఈ సినిమా టికెట్ రేట్ సింగిల్ స్రీన్స్‌ల‌లో రూ.65, మ‌ల్టీఫెక్స్‌ల‌లో రూ.100 వరకు పెంచుకోవచ్చు. అలానే రాష్ట్రంలో 23 చోట్ల 12వ తేదీ అర్థ‌రాత్రి 1 గంట షోకు, అలాగే 12 నుంచి 18వ తేదీ వ‌ర‌కు ఉద‌యం 4 గంట‌ల‌కు షోకు తెలంగాణ ప్రభుత్వం అనుమ‌తి ఇచ్చింది. ఇక దీంతో ఆంధ్ర ప్రదేశ్ లోని మహేష్ బాబు ఫ్యాన్స్.. ఏపీ ప్రభుత్వ నిర్ణయం కోసం.. ఆంధ్రాలో టికెట్ ధరలు.. బెనిఫిట్ షోల వివరాల కోసం తెగ ఎదురుచూశారు.

తాజాగా ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్ కూడా టికెట్ ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మహేష్ బాబు అభిమానులను ఖుషీ చేసింది. ఆంధ్రప్రదేశ్ జారీ చేసిన జీవో ప్రకారం ప్రతి టికెట్ పై రూ.50 పెంచుకునేందుకు వెసులు బాటు కలిపించింది. రిలీజ్ తేదీ నుంచి పది రోజుల పాటు పెంచిన ధరలతో గుంటూరు కారం టికెట్స్ థియేటర్స్ వారు అమ్ముకోవచ్చు. అయితే అదనపు షోలకు సంబంధించి మాత్రం.. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. బెనిఫిట్ షోలకి అనుమతి ఇస్తుందా లేదా అనేది ఇంకా మహేష్ అభిమానులకు టెన్షన్ గానే మిగిలింది.

కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు మంచి స్పందన దక్కించుకున్నాయి. ఈ సినిమా సంక్రాంతికి నాగార్జున నా సామి రంగా, తేజ హనుమాన్, వెంకటేష్ సైంధవ్ సినిమాలతో పోటీ పడాల్సి ఉంది. హాసిని, హారిక క్రియేషన్స్‌ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.

Also Read: Sankranthi Special Trains: సంక్రాంతి రద్దీ తట్టుకునేందుకు మరిన్ని ప్రత్యేక రైళ్లు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Trending News