Shock to Waltair Veerayya: మరో సారి వాల్తేరు వీరయ్య యూనిట్ కు షాక్.. ఈసారి ఏమైందంటే?

Shock to Waltair Veerayya Pre Release Event: చిరంజీవి హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ విశాఖపట్నంలో జరగబోతున్న క్రమంలో సినిమా యూనిట్ కు వరుస షాకులు ఇస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 7, 2023, 07:41 PM IST
Shock to Waltair Veerayya: మరో సారి వాల్తేరు వీరయ్య యూనిట్ కు షాక్.. ఈసారి ఏమైందంటే?

AP Government Shock to Waltair Veerayya Pre Release Event: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ విశాఖపట్నంలో జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ వేదికగా నిర్వహిస్తామని ముందుగా సినిమా యూనిట్ ప్రకటించింది. జనవరి 8వ తేదీన సాయంత్రం ఐదు గంటల నుంచి ఈవెంట్ విశాఖ ఆర్కే బీచ్ వేదికగా జరుపుతామని ముందు యూనిట్ ప్రకటిస్తే పోలీసులు సినిమా యూనిట్ కు షాక్ ఇచ్చారు. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 1 ప్రకారం ఆర్కే బీచ్లో నిర్వహించడానికి అవకాశం లేదంటూ మరో ప్రత్యామ్నాయ వేదిక చూసుకోమని సూచించారు.

దీంతో నిర్వాహకులు ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ లో నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆర్కే బీచ్ లో అప్పటికే దిగుమతి చేసుకున్న సామాగ్రిని కూడా ఏయూ గ్రౌండ్స్ కి తరలించి వేదిక నిర్మాణం ప్రారంభించారు. అయితే మరోసారి ఆర్కే బీచ్ లో అనుమతి ఇస్తున్నామని అక్కడ చేసుకోవచ్చని ప్రభుత్వ అధికారుల నుంచి సమాచారం రావడంతో మరోసారి ఏయూ గ్రౌండ్స్ లోని సామాగ్రి అంతా తీసుకువచ్చి ఆర్కే బీచ్ లో ఇప్పటికే వేదిక నిర్మాణం ప్రారంభించారు.

ఉదయం నుంచి ఈ వేదిక నిర్మాణం సాగుతుండగా దాదాపు పూర్తికావచ్చింది. అయితే ఇప్పుడు మరోసారి అధికారులు వచ్చి ఇక్కడ అనుమతి ఇవ్వలేమని మళ్లీ ఏయూ గ్రౌండ్స్ కి వెళ్ళిపోమని చెప్పడంతో నిర్వాహకులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. ముందు చెప్పినట్లుగానే ఏయూ గ్రౌండ్స్ లో చేసుకుంటుంటే తమను ఎందుకు వెనక్కి పిలిపించారో అర్థం కావడం లేదని వారంతా వాపోతున్నారు. ఇప్పటికే వేదిక నిర్మాణానికి సంబంధించి దాదాపు పూర్తికావచ్చిందని ఇలా చివరి నిమిషంలో చెబితే రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయానికి తాము వేదిక కట్టడం పూర్తి చేయగలమో లేదో అని వారంతా టెన్షన్ పడుతున్నారు.

ప్రస్తుతానికైతే వారు పోలీసులతో ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక విషయంలో కూడా అదే గందరగోళం నెలకొంది. ముందుగా ఒంగోలు సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు ఒక గ్రౌండ్ సిద్ధం చేయగా అక్కడ కుదరదని పోలీసులు చెప్పడంతో శివార్లలో మరో గ్రౌండ్ లో జరిపారు. అయితే మెగాస్టార్ చిరంజీవి ఈవెంట్ కి మాత్రం అనుమతి ఇవ్వడంతో నందమూరి అభిమానులు, టిడిపి కార్యకర్తలు నుంచి అభ్యంతరాలు పెద్ద ఎత్తున రావచ్చని ఉద్దేశంతో ముందు చిరంజీవి ఈవెంట్ కి అనుమతి ఇచ్చిన తర్వాత మరోసారి వెనక్కి తీసుకున్నారని ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది.

అదే విధంగా మెగాస్టార్ ఈవెంట్ జరిపేందుకు ఎంచుకున్న స్థలం ఆర్కే బీచ్, ఈ ఆర్కే బీచ్ ఎప్పుడు రద్దీగానే ఉంటుంది. దానికి తోడు పక్కనే ఉన్న రోడ్డు కూడా ట్రాఫిక్ జామ్ కి గురయ్యే అవకాశం ఉండడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయం మీద పోలీసు ఉన్నతాధికారులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ స్పందిస్తే తప్ప అసలు ఈ వ్యవహారంలో ఏం జరుగుతుందనే విషయం మీద క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు. 
Also Read: 6-Year-Old Boy Shoots : టీచర్ తిట్టిందని గన్ తీసి కాల్చేసిన ఆరేళ్ల బుడతడు!

Also Read: Waltair Veerayya Theatrical Trailer: పూనకాలు లోడింగ్.. వింటేజ్ బాస్ ఈజ్ బ్యాక్.. ట్రైలర్ చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 
 

Trending News