అనుష్క నిర్ణయంపై ఆధారపడి వున్న సూర్య భార్య జ్యోతిక సినిమా!

నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బాల డైరెక్ట్ చేసిన ఈ సినిమా తమిళనాట పలు వివాదాలకు కేంద్రబిందువైనప్పటికీ.. కోలీవుడ్ ఆడియెన్స్‌ని మెప్పించడంలో సక్సెస్ అయింది. 

Last Updated : Mar 2, 2018, 04:55 PM IST
అనుష్క నిర్ణయంపై ఆధారపడి వున్న సూర్య భార్య జ్యోతిక సినిమా!

తమిళ స్టార్ హీరో సూర్య భార్య, తెలుగు వారికి సుపరిచిత నటి అయిన జ్యోతిక నటించిన నాచియార్ సినిమా తమిళంలో సంచలన విజయం నమోదు చేసుకుంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బాల డైరెక్ట్ చేసిన ఈ సినిమా తమిళనాట పలు వివాదాలకు కేంద్రబిందువైనప్పటికీ.. కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మాత్రం తన సత్తా చాటుకుంది. తమిళంలో హిట్ అయిన ఈ సినిమాను తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేసేందుకు నిర్మాతలు రూ.90 లక్షలకు డబ్బింగ్ రైట్స్ కూడా అమ్ముకున్నారు. అయితే డబ్బింగ్ రైట్స్ అమ్ముడుపోయాకా డైరెక్టర్ బాల మనసు మారిందట. ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి విడుదల చేసేకన్నా.. రీమేక్ చేస్తే మరిన్ని లాభాలు ఆర్జించొచ్చు అని బాలా ఇచ్చిన సలహా మేరకు నిర్మాతలు అనుష్క శెట్టిని ఆశ్రయించారని తెలుస్తోంది. 

తమిళంలో నాచియార్ సినిమాలో జ్యోతిక పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్రను అనుష్కను చేయాల్సిందిగా కోరారట నిర్మాతలు. ఒకవేళ అనుష్క కానీ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, నాచియార్ సినిమాను జ్యోతికతో కాకుండా అనుష్క వెర్షన్‌లో చూడవచ్చు. లేదంటే.. జ్యోతిక నటించిన సినిమానే డబ్బింగ్ వెర్షన్‌లో చూడొచ్చు. జ్యోతిక తర్వాతి తెలుగు సినిమా విడుదల భవితవ్యం అనుష్క తీసుకోబోయే ఆధారపడి వుంటుందని చెబుతున్నాయి మన టాలీవుడ్ వర్గాలు.

Trending News