Anushka Shetty Marriage: అనుష్క పెళ్లి ఫిక్స్.. వరుడు ఎవరో తెలుసా! అస్సలు ఊహించరు

Tollywood Heroine Anushka to marry Businessman. తాజాగా అనుష్క శెట్టి పెళ్లికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Aug 25, 2022, 05:56 PM IST
  • అనుష్క పెళ్లి ఫిక్స్
  • వరుడు ఎవరో తెలుసా
  • అస్సలు ఊహించరు
Anushka Shetty Marriage: అనుష్క పెళ్లి ఫిక్స్.. వరుడు ఎవరో తెలుసా! అస్సలు ఊహించరు

 Actress Anushka to marry Businessman very soon: అనుష్క శెట్టి.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్స్‌లలో అనుష్క ఒకరు. కింగ్ నాగార్జున హీరోగా వచ్చిన 'సూపర్' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన స్వీటీ.. వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటించారు. తెలుగులో దాదాపు స్టార్ హీరోలు అందరితోనూ అనుష్క నటించారు. నాగార్జున, మహేష్ బాబు, గోపీచంద్, వెంకటేష్, బాలకృష్ణ, చిరంజీవి, ప్రభాస్, రవితేజ, జగపతిబాబు, మంచు విష్ణులతో అనుష్క నటించారు. 

అనుష్క శెట్టి ఓ వైపు అగ్ర హీరోలతో నటిస్తూనే.. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలో సత్తాచాటారు. 'అరుంధతి' సినిమాతో అనుష్క రేంజ్ ఎలా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆపై బాహుబలి, భాగమతి లాంటి సినిమాలు స్వీటీ ఇమేజ్‌ను ఎక్కడికో తీసుకెళ్ళాయి. ఇటీవల పూర్తిగా సినిమాలు తగ్గించిన అనుష్క.. చివరిగా 'నిశ్శబ్ధం' సినిమాలో నటించారు. ఆ తరువాత వెండి తెరపై కనిపించలేదు. 

అనుష్క శెట్టి ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్లు దాటింది. అనుష్క తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన చాలా మంది యంగ్ హీరోయిన్స్ పెళ్లిళ్లు చేసుకొని సెటిల్ అయిపోయారు. అయితే 40 ఏళ్లు వయసున్న స్వీటి మాత్రం ఇంకా వివాహ బంధంలోకి అడుగుపెట్టలేదు. అయితే ఈమె పెళ్లిపై ఎప్పుడూ వార్తలు చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ప్రభాస్‌తో అనుష్క ప్రేమలో ఉందంటూ ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. అంతేకాదు సీక్రేట్‌గా చెట్టాపట్టాలేసుకుని తిరిగారని, పెళ్ళి చేసుకోవాలనుకున్నారని వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. అయితే ఈ విషయంపై అటు ప్రభాస్, ఇటు అనుష్క స్పందించలేదు. 

తాజాగా అనుష్క శెట్టి పెళ్లికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ బడా బిజినెస్ మ్యాన్‌తో అనుష్క పెళ్లి జరుగుతుందని నెట్టింట ఓ వార్త వైరల్ అవుతోంది. ఆ బడా బిజినెస్ మ్యాన్‌ బెంగళూరుకు చెందిన వారని ఒకరు అంటుండగా.. దుబాయికి చెందిన వాడని ఇంకొకరు అంటున్నారు. మరి ఎంత నిజముందో ఆ దేవుడికే తెలియాలి. ఏదేమైనా 40 ఏళ్ల అనుష్క ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతుందో అని అందరూ ఎదురుచూస్తున్నారు. మరి స్వీటీ ఎప్పుడు తీపి కబురు చెపుతుందో. 

Also Read: Liger OTT: ఓటీటీలో విజయ్‌ దేవరకొండ 'లైగర్‌'.. ఎప్పుడు, ఎందులోనో తెలుసా!

Also Read: ఈ టెక్నిక్‌లు అనుసరిస్తే.. 13 అడుగుల కింగ్ కోబ్రా కూడా ఏమీ చేయలేదు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News