Anu Emmanuel relationship: ప్రేమలో లేను, సింగిల్ గానూ లేను.. కొత్త అనుమానాలు పుట్టించిన అను ఇమ్మాన్యుయేల్

Anu Emmanuel on her relationship :  హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ తన రిలేషన్ షిప్ స్టేటస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను సింగిల్ కాదని అలా అని ప్రేమలో కూడా లేనని కామెంట్ చేసింది. ఆ వివరాలోకి వెళితే

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 2, 2022, 07:11 PM IST
Anu Emmanuel relationship: ప్రేమలో లేను, సింగిల్ గానూ లేను.. కొత్త అనుమానాలు పుట్టించిన అను ఇమ్మాన్యుయేల్

Anu Emmanuel interesting comments on her relationship status: అమెరికాలో సెటిలైన మలయాళీ కుటుంబంలో పుట్టి పెరిగిన అను ఇమ్మానుయేల్ తొలత మలయాళ సినిమా స్వప్న సంచారి అనే సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమైంది. ఆ తర్వాత ఐదేళ్ల గ్యాప్ తీసుకుని యాక్షన్ హీరో బిజ్జు అనే సినిమాతో ఆమె హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత తెలుగులో మజ్ను అనే సినిమాతో తెలుగు వారికి పరిచయమైన ఆమె కిట్టు ఉన్నాడు జాగ్రత్త, ఆక్సిజన్, అజ్ఞాతవాసి, నా పేరు సూర్య వంటి సినిమాల్లో నటించింది.

అయితే ఆమె చేసిన ఏ ఒక్క సినిమా కూడా హిట్ కాకపోవడంతో ఆమెకు తర్వాత అవకాశాలు తగ్గాయి. అయితే గీత గోవిందం సినిమాలో చిన్న పాత్ర చేసింది కానీ ఆ సినిమా సూపర్ హిట్ అయింది. తర్వాత శైలజ రెడ్డి, అల్లుడు అదుర్స్, మహాసముద్రం లాంటి సినిమాల్లో కనిపించింది కానీ ఆ ఏ సినిమా కూడా హిట్ కాకపోవడంతో ఆమెకు పెద్దగా అవకాశాలు అయితే వెంటవెంటనే రావడం లేదు. ఇటీవల అల్లు శిరీష్ హీరోగా నటించిన ఊర్వశివో రాక్షసివో సినిమా ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమైంది.

ఈ సినిమా నవంబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆమె వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటుంది. ఈ సందర్భంగా తన రిలేషన్షిప్ స్టేటస్ గురించి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను సింగిల్ గా లేనని అంటూనే ప్రేమలో కూడా లేనని చెప్పుకొచ్చింది అంటే ఆమె ఎవరితోనో డేటింగ్ లో ఉందని అయితే అది పెళ్లి వరకు వెళుతుందా లేదా అనే విషయం మీద ఆవిడకే క్లారిటీ లేక ఇలా సమాధానం చెప్పి ఉండవచ్చని చెబుతున్నారు.

ప్రస్తుతానికి ఆమె చేతిలో ఒక పెద్ద ప్రాజెక్టు ఒక్కటే ఉంది. రవితేజ హీరోగా నటిస్తున్న రావణాసుర సినిమాలో ఆమె హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకరకంగా ఈ సినిమా మీద ఆమె భవితవ్యం ఆధారపడి ఉందని చెప్పక తప్పదు. కొన్నాళ్ల క్రితం నుంచి ఆమె అల్లు శిరీష్ తో ప్రేమలో ఉందనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది కానీ తాము మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని వీరిద్దరూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

Also Read: Case on Devi sri prasad: ఎరక్కపోయి ఇరుకున్న దేవి శ్రీ ప్రసాద్.. బూతు సాంగ్లో పవిత్ర మంత్రం.. కరాటే కళ్యాణి ఘాటు వార్నింగ్!

Also Read: Sohail Kathuria Biodata: అసలు ఎవరీ సోహైల్ కతూరియా.. హన్సికను ఎలా పడేశాడో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News