Anni Manchi Sakunamule: ఆ హిట్ల తరువాత ''అన్నీ మంచి శకునములే''నా?

Anni Manchi Sakunamule Releasing on 18th May: నందిని రెడ్డి దర్శకత్వంలో అన్నీ మంచి శకునములే అనే సినిమా రూపొందుతోండగా ఈ సినిమా కూడా ఖచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు దర్శక నిర్మాతలు.

Written by - Chaganti Bhargav | Last Updated : May 4, 2023, 08:40 PM IST
Anni Manchi Sakunamule: ఆ హిట్ల తరువాత ''అన్నీ మంచి శకునములే''నా?

Anni Manchi Sakunamule From Swapna Cinema: సినీ నటీనటుల లేదా ఇతర టెక్నీషియన్ల వారసులు సినీ రంగ ప్రవేశం చేయడం సర్వ సాధారణం, అయితే ఇదంతా మనం ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం. అలాగే వైజయంతి మూవీస్ బ్యానర్ స్థాపించి అనేక సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులందరినీ అలరించిన అశ్వినిదత్ కుమార్తెలు స్వప్నదత్,  ప్రియాంక దత్ ఇద్దరూ కలిసి స్వప్న సినిమా పేరుతో ఒక నూతన నిర్మాణ సంస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

అలా ప్రారంభమైన స్వప్న సినిమా బ్యానర్ నుంచి ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి, సీతా రామం వంటి సినిమాలు ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. నాని హీరోగా ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో నాగ్ అశ్విన్ డైరెక్టర్ గా పరిచయమయ్యారు. ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. తర్వాత కీర్తి సురేష్ హీరోయిన్ గా అలనాటి నటి సావిత్రి జీవితం వచ్చిన మహానటి సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇక దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి డైరెక్షన్లో ఇటీవల రిలీజైన సీతారామం సినిమాకి కూడా ఎంత రెస్పాన్స్ వచ్చిందో తెలుగు ప్రేక్షకులందరికీ తెలుసు. ఇప్పుడు వీరి బ్యానర్ నుంచి మరో సినిమా రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. ఫ్యామిలీ సినిమాలు డైరెక్ట్ చేస్తారని పేరు ఉన్న నందిని రెడ్డి దర్శకత్వంలో అన్నీ మంచి శకునములే అనే సినిమా రూపొందుతోంది. వర్షం సినిమా డైరెక్టర్ శోభన్ కుమారుడు సంతోష్ శోభన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తుండగా మలయాళ భామ మాళవిక నాయక్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.

Also Read: Rashmika Mandanna Dating: బెల్లంకొండ డేటింగ్ రూమర్స్ పై రష్మిక సైలెన్స్.. ఎందుకబ్బా?

నిజానికి సంతోష్ శోభన్ హీరోగా లాంచ్ అయ్యి చాలా కాలమే అవుతున్నా ఆయనకు చెప్పుకోదగ్గ హిట్ అయితే లేదు. ఫ్యామిలీ సినిమాలు చేస్తూ వస్తున్న సంతోష్ ఏక్ మినీ కథ అనే ఒక ప్రయోగాత్మక సబ్జెక్టుతో యూత్లో కొంత క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇలాంటి సంతోష్ శోభన్ హీరోగా అన్నీ మంచి శకునములే అనే ఒక ఆసక్తికరమైన టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కింది. మే 18వ తేదీన సినిమాని గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ చేసేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ అయిన మాళవిక నాయర్ కూడా తెలుగులో పలు సినిమాలు చేసింది కానీ ఆమె కంటూ నటిగా సరైన గుర్తింపు అయితే దక్కలేదు. తెలుగులో చేసిన ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి సినిమాలో చిన్న పాత్ర తప్పితే ఆమె మరికొన్ని సినిమాల్లో హీరోయిన్గా నటించినదనే  విషయం కూడా చాలా మంది ప్రేక్షకులకు గుర్తులేదు. ఇలాంటి కాంబినేషన్ లో వస్తున్న అన్నీ మంచి శకునములే సినిమా మీద అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. ఎందుకంటే స్వప్న సినిమా బ్యానర్ నుంచి వచ్చిన మూడు సినిమాలు ఇప్పటివరకు సూపర్ హిట్లుగా నిలిచాయి. దీంతో ఈ సినిమా కూడా ఖచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు దర్శక నిర్మాతలు.

దానికి తోడు ఈ సినిమా అటు నందిని రెడ్డి మొదలు సంతోష్ శోభన్, మాళవిక నాయర్ సహా అందరికీ ఈ సినిమా చాలా ముఖ్యమైనది. ఈ సినిమాతో టాలీవుడ్ లో సంతోష్ శోభన్ హీరోగా తన మార్కు చాటుకుంటాడని అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. మే 18 వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు  ఈ సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ అంతా ప్రేక్షకులను ఎంగేజ్ చేసే విధంగా ఉంది. ఈ నేపద్యంలో ఖచ్చితంగా ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరిస్తారని నమ్ముతున్నారు. ఈ సినిమాతో అటు సంతోష్ శోభన్ ఇటు మాళవిక నాయర్ కెరియర్లు మరో మలుపు తిరుగుతాయని భావిస్తున్నారు.

Also Read: Brahmanandam Campaign: బ్రహ్మానందం ఎన్నికల ప్రచారం.. ఎవరి కోసమో తెలిస్తే షాకవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News