Animal : షాకింగ్ రన్ టైం తో యానిమల్.. సినిమాకి రెండు ఇంటర్వెల్స్..ఈ వార్త నిజమేనా ?

Sandeep Reddy Vanga : సినిమా ప్రేక్షకులను థియేటర్స్ లో మూడు గంటలసేపు కూర్చోబెట్టాలి అంటే ఆ చిత్రం తప్పకుండా అద్భుతంగా ఉండాలి. కాగా సందీప్ రెడ్డి మాత్రం మూడు గంటలు కాదు ఏకంగా మూడు గంటల 30 నిమిషాలు ప్రేక్షకులను థియేటర్స్ లో కూర్చోబెట్టడానికి చూస్తున్నారట. దీనికి తోడు ఆయన సినిమాకి రెండు విశ్రాంతిలు కూడా ఇవ్వాలి అనుకుంటున్నారట. అసలు ఆయన తీస్తున్న యనిమల్ సినిమా విషయంలో ఏమి జరుగుతుందో ఒకసారి చూద్దాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 31, 2023, 04:47 PM IST
Animal : షాకింగ్ రన్ టైం తో యానిమల్.. సినిమాకి రెండు ఇంటర్వెల్స్..ఈ వార్త నిజమేనా ?

Animal Run-time: అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగులో సెన్సేషనల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు సందీప్ రెడ్డి వంగ. ఇక ఆ తరువాత వెంటనే మరో తెలుగు సినిమా చేయకుండా అర్జున్ రెడ్డిని హిందీలో కబీర్ సింగ్ గా తీసి అక్కడ కూడా సూపర్ హిట్ అందుకున్నారు. ఇక ఇప్పుడు అర్జున్ రెడ్డి విడుదలైన చాలా రోజుల తరువాత రణబీర్ కపూర్ హీరోగా వస్తోందా యానిమల్ సినిమాతో హిందీ, తెలుగు ప్రేక్షకులను అల్లరించనున్నారు.

కాగా ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ అలానే రెండు పాటలు సందీప్ రెడ్డి వంగ మార్క్ చూపియ్యదమే కాకుండా సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ చిత్రం గురించి అందుతున్న మరో వార్త అందరిని షాక్ గురిచేస్తుంది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం యనిమల్ నిడివి అక్షరాలా 3 గంటల 30 నిముషాలు అంటే. అంతేకాదు ఈ సినిమా ఫైనల్ సెన్సార్ కాపీ కూడా అంత నిడివితోనే పంపించారని టి సిరీస్ వర్గాల కథనం. మామూలుగా మూడు గంటల సినిమాని ప్రేక్షకులు చూడడానికి కొన్ని సార్లు ఇబ్బంది పడతారు. కాగా ఇప్పుడు ఏకంగా 3 గంటల 30 నిమిషాలు సినిమా సందీప్ రెడ్డి విడుదల చేయబోతున్నారు అంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటి అంటే సందీప్ రెడ్డి తన మొదటి సినిమా అర్జున్ రెడ్డి ని కూడా మొదట్లో నాలుగు గంటలకు పైగానే ప్లాన్ చేసుకున్నాడు. కానీ కొత్త హీరోతో అంత సుదీర్ఘమైన నిడివి అంటే థియేటర్ వర్గాల నుంచి మద్దతు దక్కదనే అనుమానంతో అప్పట్లో వెనకడుగు వేశారు సందీప్. కానీ ఇప్పుడు మాత్రం యనిమల్ విషయంలో అలా నిర్ణయం మార్చుకోవాలి అనుకోవడం లేదట. ఇక దీనికి హీరో రన్బీర్ కపూర్ మద్దతు ఇస్తున్నట్టు వినికిడి.  

కాగా ఈ సినిమా ఇంత నిడివితో రాబోతూ ఉండటంతో చాలామంది ఈ సినిమాకి రెండు ఇంటర్వెల్స్ ఇవ్వాల్సి రావొచ్చు అని అంటున్నారు. కాగా హిందీ సినిమాలకు ఇదేమి కొత్త కాదు..  అమీర్ ఖాన్ లగాన్, సల్మాన్ హం ఆప్కె హై కౌన్ లకు అప్పట్లో రెండు ఇంట్రవెల్స్ ఇచ్చారు. ఆ సినిమాలు బ్లాక్ బస్టర్లుగా కూడా నిలిచాయి. మరి ఇప్పుడు ఇదే సందీప్ రెడ్డి మరోసారి రిపీట్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. 

ఐతే ప్రస్తుతం మరో పక్క మరో వార్త కూడా వినిపిస్తోంది. అదేమిటి అంటే సోషల్ మీడియాలో యానిమల్ టైం గురించి పెద్ద చర్చ జరుగుతూ ఉండగా, ఇక అదే విషయం గురించి ‘యానిమల్’ టీం నుంచి క్లారిఫికేషన్ వచ్చినట్లు తెలుస్తోంది. ‘యానిమల్’ రన్ టైం గురించి జరుగుతున్న ప్రచారం నిజం కాదని ,ఇంకా ఫైనల్ లెంగ్త్ లాక్ చేయలేదని తెలుస్తోంది. 

మొత్తానికి ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఈ రెండు వార్తలలో ఏది నిజం అనేది సినిమా రన్ టైం అఫీషియల్ గా అనౌన్స్ చేస్తేనే తెలుస్తుంది. మొత్తానికి నిజంగానే ఫైనల్ గా మూడున్నర గంట నిడివితో వచ్చి ఈ చిత్రం కానీ బ్లాక్ బస్టర్ అయితే మరోసారి సందీప్ సెన్సేషనల్ డైరెక్టర్ గా తన ముద్ర వేసుకోవడం ఖాయం.

Also Read: Jio Annual Plans: కొత్తగా జియో ప్రీపెయిడ్ వార్షిక ప్లాన్స్ ఈ ఓటీటీలు ఉచితం

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News