F3 Movie Shooting: ఎఫ్ 3 సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినట్టే

F3 Movie Shooting: ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా..ఫ్రస్టేషన్‌కు ఫన్ జోడించి తీసిన సినిమా ఎఫ్ 2. బాక్సాఫీసు వద్ద భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడీ సినిమా సీక్వెల్ ఎఫ్ 3 షూటింగ్ పూర్తి కావస్తోంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 6, 2021, 06:16 PM IST
F3 Movie Shooting: ఎఫ్ 3 సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినట్టే

F3 Movie Shooting: ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా..ఫ్రస్టేషన్‌కు ఫన్ జోడించి తీసిన సినిమా ఎఫ్ 2. బాక్సాఫీసు వద్ద భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడీ సినిమా సీక్వెల్ ఎఫ్ 3 షూటింగ్ పూర్తి కావస్తోంది. 

సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) తెరకెక్కించిన ఎఫ్ 2 సినిమా గురించి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై అనిల్ తెరకెక్కించిన ఎఫ్ 2 సినిమా పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా సాగింది. ఈ సినిమా మొత్తం ఫన్ అండ్ ఫ్రస్టేషన్ కాంబినేషన్‌గా ఉంటుంది. వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ ప్రధాన పాత్రల్లో నిర్మితమైన ఎఫ్ 2 ( F2 Movie) భారీ విజయం సాధించింది. అన్నివర్గాల్ని ఆకట్టుకుందీ సినిమా. 

అందుకే ఈ బ్లాక్‌బస్టర్ మూవీకు సీక్వెల్‌గా ఎఫ్ 3 ( F3 movie) తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే మేజర్ షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఎఫ్ 3 సినిమా ఆగస్టు 27వ  తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. వెంకటేశ్, వరుణ్ తేజ్‌ల కాంబినేషన్ సీన్స్ పూర్తయ్యాయి. కొన్ని కీలక సన్నివేశాలు మినహా మిగిలిన భాగమంతా పూర్తయింది. ఎఫ్ 2 లో ఉన్నట్టే అద్బుతమైన టైమింగ్ డైలాగ్స్‌తో ఎఫ్ 3 సీన్స్ ఉంటాయని తెలుస్తోంది. తరువాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు మిగిలుంటాయి.

Also read: Jathi Ratnalu collections: కరోనా కాలంలోనూ జాతి రత్నాలు కలెక్షన్స్ అదుర్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News