ముంబై పోలీసులకు అనిల్ కపూర్ కృతజ్ఞతలు

ప్రముఖ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ముంబై పోలీసులకు, కపూర్ కుటుంబం అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. 

Last Updated : Mar 2, 2018, 05:27 PM IST
ముంబై పోలీసులకు అనిల్ కపూర్ కృతజ్ఞతలు

ప్రముఖ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ముంబై పోలీసులకు, కపూర్ కుటుంబం అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీదేవి మృతి అనంతరం అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకోవడం, బోనీ కపూర్‌పై పలు ఆరోపణలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే, ముంబైలో సిటీ పోలీసులు మాత్రం శ్రీదేవి కపూర్, అనిల్ కపూర్ నివాసాలకు భారీ భద్రత కల్పించి అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకున్నారు. వేలాదిగా తరలివస్తున్న అభిమానులతో శ్రీదేవి నివాసం ముందు ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు పరిస్థితిని దగ్గరుండి పర్యవేక్షించారు.

 

మరోవైపు అభిమానులు సైతం ఊహాగానాలను తీవ్రంగా పరిగణించకుండా శ్రీదేవి ఇంటిముందు రోజుల తరబడి ఓపిగ్గా వేచిచూశారు. ఈ పరిణామాలన్నింటిపై బోనీకపూర్ సోదరుడి హోదాలో స్పందించిన అనిల్ కపూర్.. కష్టకాలంలో తమకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు అని ఓ ట్వీట్ చేశారు. అందులో ముంబై పోలీసులకు స్పెషల్ థాంక్స్ చెప్పుకున్నారు. 

Trending News