Anchor Vishnupriya mother death ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజు జమున, డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి మరణించారు. మొన్న జబర్దస్త్ రీతూ తండ్రి చనిపోయారు. ఇప్పుడు విష్ణుప్రియ తల్లి మరణించారు. ఇలా వరుసగా విషాదాలు నెలకొంటున్నాయి. గత ఏడాది టాలీవుడ్ సీనియర్ నటులు, దిగ్గజ తారలు మరణించారు. ఇక ఇప్పుడు విష్ణుప్రియ అయితే తన తల్లిని తలుచుకుంటూ ఎమోషనల్ అవుతోంది.
జనవరి 26న విష్ణుప్రియ తల్లి చనిపోయినట్టు తెలుస్తోంది. అనారోగ్య సమస్యలతోనే ఆమె కన్నుమూసినట్టు సమాచారం. అయితే తన తల్లి మరణ వార్తను చెబుతూ విష్ణుప్రియ ఎమోషనల్ అయింది. మై డియర్ లవ్లీ అమ్మా.. నేటి వరకు నువ్ నా పక్షానే ఉన్నావ్.. అందుకు థాంక్స్.. నీతో గడిపిన ప్రతీ క్షణాన్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను.. నా బలం, బలహీనతలు నువ్వే..
కానీ ఇప్పుడు ఈ విశ్వంలో నువ్ నన్ను ఒంటరిగా వదిలి వెళ్లావ్.. నువ్ ప్రతీ చోటా ఉంటావ్ అని నాకు తెలుసు.. నా ప్రతీ శ్వాసలో నువ్ ఉంటావ్ అని నాకు తెలుసు.. నువ్ నా కోసం చేసిన త్యాగాలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.. నాకు నీ ప్రేమను ఏదో ఒక రూపంలో అందిస్తూ ఉండమ్మా.. నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అని విష్ణుప్రియ ఎమోషనల్ అయింది.
విష్ణుప్రియ, రీతూ చౌదరిలు ఈ మధ్య మాల్దీవుల్లో ఎంజాయ్ చేసి వచ్చారు. ఇలా ఇద్దరి ఇంట్లో ఒకేసారి విషాదాలు నెలకొన్నాయి. ఇది నిజంగానే యాదృశ్చికరం. ప్రస్తుతం ఈ ఇద్దరూ తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. విష్ణుప్రియ, రీతూలకు అండగా వారి అభిమానులు నిల్చున్నారు. మరి వీరు మళ్లీ మునుపటిలా తిరిగేందుకు ఇంకాస్త టైం పట్టేలానే ఉంది.
Also Read: Hunt Telugu Movie Review : హంట్ రివ్యూ.. సుధీర్ బాబు డేరింగ్ స్టెప్
Also Read: Sharwanand Engagement: ఘనంగా హీరో శర్వానంద్ ఎంగేజ్మెంట్.. వైరల్ పిక్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి