బుల్లి తెరపై పాపులర్ యాంకర్స్‌లో శ్రీముఖి ఒకరు. తన విభిన్నమైన యాంకరింగ్ స్కిల్స్‌తో శ్రీముఖి భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకుంది. బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ 3లో శ్రీముఖి రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ తరువాత శ్రీముఖి అభిమానుల సంఖ్య మరింత పెరిగింది అని చెప్పొచ్చు. తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం, యాంకర్ శ్రీముఖి ప్రేమలో పడిందని, శ్రీముఖి తనకు నచ్చిన వాడితో డేటింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
గతంలో శ్రీముఖి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, తను ప్రేమలో ఉన్నానని చెప్పుకొచ్చింది. తాను ప్రేమించే వ్యక్తి తన తల్లితండ్రులు నుండి సమ్మతి పొందిన తర్వాతే ముందుకు వెళ్తాను అని శ్రీముఖి చెప్పినట్టు టాలీవుడ్ వర్గాల్లో ఓ టాక్ వినిపిస్తోంది. ఐతే అతడు ఎవరు, ఏంటనే వివరాలు మాత్రం వెల్లడించలేదు. శ్రీముఖి బిగ్ బాస్ 3 తెలుగు హౌజ్‌లో ఉన్నప్పుడు, బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌లో భాగంగా ఆమె తన లవ్ స్టొరీ ( Anchor Srimukhi love story ) గురించి చెప్పింది.
Also read : Bigg Boss 4 Telugu: ఈ వారం నామినేషన్‌లో ఉన్న కంటెస్టెంట్స్ మధ్య తారాస్థాయికి చేరిన మాటల యుద్ధం !
మొత్తానికి శ్రీముఖి ఒకరితో డేటింగ్ ( Anchor Srimukhi dating ) చేస్తోందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి కానీ ఇంతకి ఆ లక్కీ ఫెలో ఎవరు అనే విషయంలోనే ప్రస్తుతానికి క్లారిటీ లేదు. ఆమె జీవితంలోకి అడుగుపెట్టే ఎవరో వేచి చూడాల్సిందే మరి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.
మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి