Anchor Rashmi Emotional యాంకర్ రష్మీ తాజాగా చైతన్య మాస్టర్ మృతి పట్ల స్పందించింది. అప్పులు బాధను తాళలేక ప్రాణాలు వదిలిన సంగతి తెలిసిందే. చైతన్య మాస్టర్ ఉరేసుకునే ముందు ఓ సెల్పీ వీడియోను రికార్డ్ చేసుకున్న సంగతిత తెలిసిందే. ఆ వీడియోనే ఇప్పుడు వైరల్ అవుతోంది. అందులో తన బాధలన్నీ చెప్పుకున్నాడు. అప్పుల బాధలు భరించలేకనే ఈ పని చేస్తున్నాను అని, అందరూ తనను క్షమించాలని వేడుకున్నాడు. ఇక చైతన్య మాస్టర్ సూసైడ్ మీద రష్మీ ఎమోషనల్ అయింది.
ఢీ షోతో నేమ్, ఫేమ్ వచ్చిందని, డబ్బులు మాత్రం రాలేదని, జబర్దస్త్ షోలో ఎక్కువగా డబ్బులు ఇస్తారంటూ సూసైడ్ వీడియోలో చైతన్య మాస్టర్ చెప్పుకొచ్చాడు. అయితే మల్లెమాల ఇచ్చే రెమ్యూనరేషన్ల మీద ఇప్పుడు మళ్లీ చర్చలు మొదలయ్యాయి. ఇక తమ్మారెడ్డి వంటి వారు అయితే అలా రెమ్యూనరేషన్లు పోల్చుకోవద్దని,ఏ షోకు ఉండే క్రేజ్ ఆ షోకు ఉంటుందని అన్నాడు. అసలు ఆత్మహత్య చేసుకోవడమే తప్పు అని అన్నాడు.
ఇక మాస్టర్ సూసైడ్ చేసుకోవడం పట్ల వర్ష, శేఖర్ మాస్టర్, వర్ష, హైపర్ ఆది ఇలా అందరూ కూడా స్పందించారు. మాస్టర్ మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇలా ఎలా చనిపోగలిగారు.. మమ్మల్ని ఎలా వదిలేశారు అంటూ ఎమోషనల్ అయ్యారు. అయితే చైతన్య మాస్టర్ అంత్యక్రియల్లో చిట్టి మాస్టర్, ఆయన స్నేహితులు, చైతన్య మాస్టర్ కంటెస్టెంట్లు పాల్గొన్నారు. కడసారి చూస్తూ కన్నీటి పర్యంతమయ్యారు.
Also Read: Chaithanya Master Suicide : ఢీ కొరియోగ్రఫర్ మృతి.. ఆ కారణాలతోనే సూసైడ్
తాజాగా యాంకర్ రష్మీ కూడా చైతన్య మాస్టర్ మరణం మీద స్పందించింది. సూసైడ్ చేసుకోవడం, మరణించడం అనేది సమస్యకు పరిష్కారం కాదు మాస్టర్ అంటూ ఎమోషనల్ అయింది. మీ కుటుంబానికి, అభిమానులకు శక్తినివ్వాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను అని రష్మీ పోస్ట్ వేసింది. ఇక చైతన్య మాస్టర్ అయితే డబ్బు కోసమో, అప్పుల కోసమో భయపడి చనిపోయే రకం కాదని సన్నిహితులు, తల్లి అంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
Anchor Rashmi Emotional : ఆత్మహత్య పరిష్కారం కాదు మాస్టర్.. యాంకర్ రష్మీ ఎమోషనల్
చైతన్య మాస్టర్ మృతిపై సంతాపం
బుల్లితెర తారల ఎమోషనల్ పోస్టులు
ఆత్మహత్య పరిష్కారం కాదన్న రష్మీ