Rashmi Gautam : కుక్కలు కరిస్తే గోల చేస్తున్నారు కానీ వాటిని మీరేమైనా చేయొచ్చా?.. మండిపడ్డ యాంకర్ రష్మీ

Rashmi Gautam About Pet Harassment కుక్కల దాడి మీద రోజురోజుకూ లెక్కలేనన్ని వార్తలు వస్తూనే ఉంటున్నాయి. రష్మీ గౌతమ్‌ అయితే పెట్స్ తరుపున ఎప్పుడూ తన వాదనలు వినిపిస్తూనే ఉంటుంది. అయితే కుక్కల దాడి విషయంలో రష్మీ మీద అందరూ ట్రోలింగ్ చేసిన సంగతి తెలిసిందే.

Written by - ZH Telugu Desk | Last Updated : May 1, 2023, 01:47 PM IST
  • కుక్కల దాడిపై నెట్టింట్లో చర్చలు
  • కుక్కల తరుపున రష్మీ వాదనలు
  • మండిపడుతున్న నెటిజన్లు
Rashmi Gautam : కుక్కలు కరిస్తే గోల చేస్తున్నారు కానీ వాటిని మీరేమైనా చేయొచ్చా?.. మండిపడ్డ యాంకర్ రష్మీ

Rashmi Gautam About Pet Harassment మహిళలపై కుక్కల దాడి, చిన్నారిపై కుక్కల దాడి అంటూ ఇలా రోజూ కొన్ని వార్తలు కనిపిస్తుంటాయి. అంబర్ పేట్‌లో కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన తరువాత సమాజం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఆ విజువల్స్ అందరినీ కదిలించాయి. అయితే ఈ కుక్కల పీడ ఎక్కువైందని, వాటిని నిర్మూలించాని ఓ వర్గం వాదనను వినిపించింది. అయితే వాటికంటూ సపరేట్‌గా షెల్టర్ ఇప్పించాలని, జనాభా నియంత్రణ చేయించాలంటూ ఇలా మరో వర్గం వాదనను వినిపించింది.

పెటా సంస్థలు, జంతు ప్రేమికులేమో కుక్కలను రిహాబిటేషన్ సెంటర్‌కు తీసుకెళ్లాలని, కుక్కలకు ఈ భూమ్మీద బతికే హక్కు లేదా?.. కేవలం మనుషులే ఈ భూమ్మీద బతాకాలా? అంటూ రష్మీ వంటి వారు నిలదీశారు. ఇక అమల అయితే ఈ ఇష్యూ మీద ప్రత్యేకంగా స్పందించింది. తమ సంస్థ ద్వారా ఎన్ని కుక్కలకు ఆపరేషన్ చేయించింది.. జనాభాను ఎంతగా కంట్రోల్ చేశారన్నది ఇలా క్లియర్‌గా లెక్కలను చెప్పింది.. వాటికి కూడా బతికే హక్కు ఉందంటూ ఇలా అమల చెప్పుకొచ్చింది.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rashmi Gautam (@rashmigautam)

తాజాగా రష్మీ ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో కుక్కలను ఎలా హింసిస్తున్నారు.. బాధపెడుతున్నారు అనేది చూపించింది. మనుషుల్ని కుక్కలు కరిస్తే చెబుతున్నారు. కానీ ఇలా కుక్కల్ని మనుషులు హింసిస్తుంటే ఎవ్వరూ పట్టించుకోరా? అందరికీ సంస్కారం నేర్పించండి.. మీ పిల్లలు ఇలా వాటిని హింసిస్తుంటే వద్దని వారించండి అని ఇలా రష్మీ అందరికీ హితబోధ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Also Read:  Chaithanya Master Suicide : ఢీ కొరియోగ్రఫర్ మృతి.. ఆ కారణాలతోనే సూసైడ్

నీకు పిల్లలకంటే కుక్కలు ఎక్కువయ్యాయా?అయితే ఓ ఎన్జీవో పెట్టుకుని వీధుల్లో ఉన్న కుక్కలన్నింటినీ పెంచుకో అని ఓ నెటిజన్ సలహా ఇచ్చాడు. ఇక మరో నెటిజన్ అయితే కుక్కలను మనుషులు ఎలా వాడుకుంటున్నారో చెప్పాడు. విషాన్ని పసిగట్టేందుకు, బాంబులను దొరకపట్టేందుకు ఇలా చాలా రకాలుగా కుక్కల్ని మనుషులు వాడుకుంటూనే ఉన్నారని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

Also Read:  Mallemala Remunerations : ఢీ షోలో చాలీచాలని రెమ్యూనరేషన్‌లు!.. కొరియోగ్రఫర్ మృతితో మల్లెమాలపై మరో మరక

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News