టాలీవుడ్ పరిశ్రమలో సీక్రెట్ ఫేవరిటిజం ఉందని యాంకర్ అనసూయ సంచలన వ్యాఖ్యలు చేసింది. సీక్రెట్ ఫేవరిటిజం వల్లే తాను లాక్డౌన్ సమయంలో నాలుగు అవకాశాలు కోల్పోయానని యాంకర్ అనసూయ ఆవేదన వ్యక్తంచేసింది. ఆ నలుగురు దర్శకులకు ఆడిషన్లో తన పర్ఫార్మెన్స్ నచ్చిందని... ఆ తర్వాత కూడా తాను అవకాశాలు కోల్పోయానని.. దానికి కారణం పరిశ్రమలో సీక్రెట్ ఫేవరిటిజం ఉండటమే అని యాంకర్ అనసూయ చెప్పుకొచ్చింది. ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ అనసూయ ఈ వ్యాఖ్యలు చేసింది.
తనకు ఇస్తానన్న సినిమాలు మరో హీరోయిన్‌కి ఇచ్చారని.. తనతో పోలిస్తే.. వాళ్ల పర్ఫార్మెన్స్ కూడా చాలా బ్యాడ్‌గా ఉందని యాంకర్ అనసూయ వ్యాఖ్యానించింది. ఆడిషన్లో తన పర్ఫార్మెన్స్ చూసి కన్నీళ్లు పెట్టుకున్న దర్శకుడు కూడా తనకు ఛాన్స్ ఇవ్వకుండా మరొకరికి ఇచ్చారంటే అది సీక్రెట్ ఫేవరేటిజం కాకుండా మరేం అవుతుందని యాంకర్ అనసూయ ఆవేదన వ్యక్తంచేసింది.
Also read : Anchor Anasuya Bharadwaj: యాంకర్ అనసూయ కొత్త ప్రయత్నం
యాంకర్ అనసూయ ప్రస్తుత ప్రాజెక్ట్స్ విషయానికొస్తే... ప్రస్తుతం ఆమె థాంక్యూ బ్రదర్ సినిమాలో ( Thank you brother movie ) నటిస్తోంది. అంతేకాకుండా తమిళంలో స్టార్ హీరో విజయ్ సేతుపతి సినిమాలోనూ యాంకర్ అనసూయ ( Anchor Anasuya ) ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాతోనే తొలిసారిగా అనసూయ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.
Also read : మరో పెళ్లి చేసుకున్న రాఘవేంద్ర రావు మాజీ కోడలు Kanika Dhillon
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook