Anasuya Bharadwaj: మీ పెంపకం ఎలాంటిదో మీరే అర్ధం చేసుకోండి.. మళ్ళీ అనసూయ సంచలన ట్వీట్!

Anasuya Bharadwaj Sensational Tweet: గత కొద్ది రోజులుగా విజయ్ దేవరకొండను ఆయనని సపోర్ట్ చేస్తున్న వారిని తన ట్వీట్ల ద్వారా టార్గెట్ చేస్తూ రెచ్చగొడుతున్న అనసూయ భరద్వాజ్ ఇప్పుడు మరో ట్వీట్ చేసింది. 

Written by - Chaganti Bhargav | Last Updated : May 10, 2023, 06:47 PM IST
Anasuya Bharadwaj: మీ పెంపకం ఎలాంటిదో మీరే అర్ధం చేసుకోండి.. మళ్ళీ అనసూయ సంచలన ట్వీట్!

Anasuya Bharadwaj Sensational Tweet again: న్యూస్ యాంకర్ గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ యాంకర్ గా మారిన అనసూయ భరద్వాజ్ గురించి తెలుగు ప్రేక్షకులు ఎవరికీ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ షో ద్వారా జబర్దస్త్ అనసూయగా ఆమె తెచ్చుకున్న పేరు మామూలుది కాదు. తెలుగులో దాదాపుగా ప్రతి ఇంట్లో అనసూయ భరద్వాజ్ తెలిసిన వారు ఒక్కరైనా ఉంటారంటే అందులో అతిశయోక్తి లేదు.  

జబర్దస్త్ షో ద్వారా సూపర్ క్రేజ్ దక్కించుకున్న ఆమె తనలో ఉన్న నటనా అనుభవాన్ని కూడా బయటపెట్టి రంగస్థలం, పుష్ప వంటి సినిమాల్లో మంచి పాత్రలు దక్కించుకుని ప్రేక్షకులను అలరించింది. ఒకపక్క జబర్దస్త్, మరోపక్క సినిమాలు చేస్తూ వెళ్లిన ఆమె అనూహ్యంగా జబర్దస్త్ కి గుడ్ బై చెబుతున్నానని చెప్పి ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. అయితే ఒకపక్క జబర్దస్త్ కి గుడ్ బై చెప్పినా సరే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటూ తనను ప్రజలు మర్చిపోకుండా చూసుకోవడంలో మాత్రం బిజీగానే ఉంది.

ఈ మధ్య కాలంలో విజయ్ దేవరకొండను పరోక్షంగా టార్గెట్ చేసిన ఆమె విజయ్ దేవరకొండ అభిమానులకు కూడా సోషల్ మీడియాలో టార్గెట్ అయింది. దీంతో గత కొద్దిరోజులుగా ఆమె వార్తల్లో నిలుస్తూ వస్తోంది అసలు విషయం ఏమిటంటే విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్గా తెరకెక్కుతున్న ఖుషి సినిమా పోస్టర్ లో విజయ్ దేవరకొండ పేరు ముందు ‘ది’ అని పెట్టడంతో దాన్ని ఆమె తప్పు పడుతూ ఒక పోస్ట్ పెట్టింది.

Also Read: Yashika Aannand Photos: చీరకట్టులో యషికా ఆనంద్ అందాల విందు.. చూసి తట్టుకోగలరా?

అయితే ఇక్కడ విజయ్ దేవరకొండ పేరు ప్రస్తావించకపోయినా ‘ది’ అని పేరు పెట్టుకున్నది విజయ్ దేవరకొండ ఒక్కరే కాబట్టి ఆయన టార్గెట్ చేశారని అందరూ భావించి ఆమె మీద పెద్ద ఎత్తున విమర్శల వర్షం కురిపించారు. ఆ తర్వాత అనసూయ కూడా కొంత  వెనకేసుకొచ్చుకునే ప్రయత్నం చేసినా అది పెద్దగా వర్కౌట్ కాలేదు.

ఇక ఆమె విజయ్ దేవరకొండను టార్గెట్ చేయడంతో హరీష్ శంకర్, కొబ్బరిమట్ట దర్శకుడు సాయి రాజేష్ వంటి వారు కూడా ఆసక్తికరంగా ‘ది’ అనే పదాన్ని ప్రస్తావిస్తూ ఆమెను మరింత హర్ట్ చేయడంతో ఈ విషయంలో ఆమె చాలా హర్ట్ అయింది. ‘’అంటే ఇంతమంది వత్తాసు పలికితే గాని పని అవ్వదు అన్నమాట, అతడు సినిమాలో బుజ్జిని పార్ధు అడిగినట్టు అదే ఎంతమంది ఏంటి అని నా ఒక్కదాని కోసం అడుగుతున్నానని ఆమె పేర్కొంది. ఏమో బాబు నాకు పిఆర్ స్టెంట్లు తెలియవు, రావు, అవసరం లేదు కూడా. కానీయండి కానీయండి అంటూ ఆమె సోషల్ మీడియాలో మరోసారి ట్వీట్ పెట్టింది.

ఆ ట్వీట్ గురించి జనం పట్టించుకుంటున్నారో లేదో అనుకుందేమో తెలియదు కానీ ప్రతి ఒక్కరూ చేస్తున్న తప్పు తప్పే నువ్వు ఒక్కరివే చేస్తున్న కరెక్ట్ కరెక్టే అంటూ ఒక ఫోటో కూడా షేర్ చేసింది. ఇక విజయ్ దేవరకొండ పుట్టినరోజు ముగిసిపోవడంతో ఈ వ్యవహారానికి బ్రేకులు పడతాయని అందరూ భావించారు. కానీ ఆమె మరోసారి మరో ట్వీట్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. నువ్వు నన్ను తిడితే నీ కంపు నోరు తప్పు అవుతుంది కానీ నేను ఎలా తప్పు అవుతాను, మా పెంపకం గర్వించదగింది నా అభిప్రాయాన్ని ధైర్యంగా గౌరవపూర్వకంగా చెప్పటం నేర్పింది. మీ పెంపకం ఎలాంటిదో మీరే అర్థం చేసుకోండి. బూతులు తిడుతున్న వారిని అసహ్యించుకోండి అంతేకానీ బూతులు తిట్టించుకోబడుతున్న వారిని కాదు అంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది.

Also Read: Shraddha Das Photos: ఢీ షో కోసం శ్రద్దా దాస్ హాట్ ట్రీట్.. ఎద అందాల ఎర

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News