Tantra Movie: 'తంత్ర'గా వస్తున్న అనన్య నాగల్ల.. ఫస్ట్‌లుక్‌ పోస్టర్ అదిరింది..!

Ananya nagalla First look: తెలుగు అమ్మాయి అనన్య నాగల్ల లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం తంత్ర. తాజాగా అనన్య పుట్టినరోజు సందర్భంగా చిత్రయూనిట్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 2, 2023, 03:56 PM IST
Tantra Movie: 'తంత్ర'గా వస్తున్న అనన్య నాగల్ల.. ఫస్ట్‌లుక్‌ పోస్టర్ అదిరింది..!

Tantra Movie Update: అనన్య నాగల్ల లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం 'తంత్ర'(Tantra Movie). తాజాగా అనన్య బర్త్‌డే(HBD Ananya nagalla) సందర్భంగా ఆమె ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను (First look Poster) రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో మూడు డిఫరెంట్‌ కలర్స్‌లో ఉన్న చేతుల జోడీ అనన్య మోహాన్ని కప్పేస్తున్నట్లు పోస్టర్‌ను సూపర్ గా డిజైన్‌ చేశారు. ఫస్ట్ లుక్ తోనే సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేసింది చిత్రయూనిట్. ఈ చిత్రానికి ఆర్‌ఆర్‌ ధృవన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్‌గా భరణి పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని నరేష్‌ బాపు, రవిచైతన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

'మల్లేశం' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అనన్య నాగల్ల. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ రెండో సినిమాకు పవర్ స్టార్ పక్కన ఛాన్స్ కొట్టిసేంది. 'వకీల్‌ సాబ్‌'లో పవన్ కల్యాణ్ తో కలిసి తెరను పంచుకుంది ఈ అమ్మడు. ఈ మూవీతో దశ మారిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆమెకు పెద్దగా అవకాశాలు ఏవీ రాలేదు, ఎక్కువగా సైడ్  క్యారెక్టర్సే పలకరించాయి. చాలా రోజుల తర్వాత అనన్య టైటిల్ రోల్ లో కనిపించబోతున్న సినిమా తంత్ర. శ్రీనివాస్‌ గోపిశెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హారర్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతోంది. 

Also Read: Nitin Desai death: లగాన్, జోధా అక్బర్ చిత్రాల ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్ కన్నుమూత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News