'కరోనా వైరస్'పై స్టార్స్ షార్ట్ ఫిల్మ్

'కరోనా వైరస్'పై అవగాహన కల్పించేందుకు తారాలోకం దిగి వచ్చింది. ఇప్పటికే తెలుగు హీరోలు ఓ పాట విడుదల చేశారు. సినీ ప్రముఖులు ఎవరికి వారు సొంతంగా 'కరోనా వైరస్'పై అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మొత్తం భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఒక్కటిగా చేరి .. అవగాహన కల్పించేందుకు సిద్ధమైంది.

Last Updated : Apr 6, 2020, 11:40 AM IST
'కరోనా వైరస్'పై స్టార్స్ షార్ట్ ఫిల్మ్

'కరోనా వైరస్'పై అవగాహన కల్పించేందుకు తారాలోకం దిగి వచ్చింది. ఇప్పటికే తెలుగు హీరోలు ఓ పాట విడుదల చేశారు. సినీ ప్రముఖులు ఎవరికి వారు సొంతంగా 'కరోనా వైరస్'పై అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మొత్తం భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఒక్కటిగా చేరి .. అవగాహన కల్పించేందుకు సిద్ధమైంది.

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా, హీరో రణ్ బీర్ కపూర్, హీరోయిన్ అలియా భట్..ఇలా అందరూ కలిసి ఓ షార్ట్ ఫిల్మ్ చిత్రీకరించారు. కరోనా వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. ఈ షార్ట్ ఫిల్మ్ కు 'ఫ్యామిలీ' అని పేరు పెట్టారు.

'ఫ్యామిలీ' షార్ట్ ఫిల్మ్ కు ప్రసూన్ పాండే దర్శకత్వం వహించారు. బిగ్ బీ ఎంటర్ టెయిన్ మెంట్ సహాయంతో దీన్ని నిర్మించారు. ఈ రోజు( సోమవారం ) రాత్రి 9 గంటలకు ఇది ప్రసారం కానుంది. కరోనా వైరస్ బారిన పడకుండా సురక్షితంగా ఉండడం ఎలా..? ఇంటి నుంచి పని చేసుకోవడం ఎలా..? సామాజిక దూరం పాటించడం ఎలా..? అనే అంశాలపై ఫ్యామిలీ లఘు చిత్రం ఉంటుందని దర్శకుడు ప్రసూన్ పాండే తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News