నేత్రదానం చేసిన ప్రముఖ హీరోయిన్

బెజవాడ, లవ్ ఫెయిల్యూర్, నాయక్, ఇద్దరమ్మాయిలతో, జెండాపై కపిరాజు లాంటి తెలుగు చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఎంతోకొంత ఫాలోయింగ్ పెంచుకున్న నటి అమలాపాల్.

Last Updated : Mar 4, 2018, 09:02 PM IST
నేత్రదానం చేసిన ప్రముఖ హీరోయిన్

బెజవాడ, లవ్ ఫెయిల్యూర్, నాయక్, ఇద్దరమ్మాయిలతో, జెండాపై కపిరాజు లాంటి తెలుగు చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఎంతోకొంత ఫాలోయింగ్ పెంచుకున్న నటి అమలాపాల్. ఈమె నటించిన "మైనా" చిత్రం కూడా తెలుగులో "ప్రేమఖైదీ" పేరుతో విడుదలై భారీ విజయం సాధించింది. ఈ మధ్యకాలంలో పలు వివాదాల్లో చిక్కుకున్న ఈ హీరోయిన్ ఇటీవలే ఓ సరికొత్త నిర్ణయం తీసుకొని అందరి ప్రశంసలూ పొందడం విశేషం. పుదుచ్చేరిలో జరిగిన ఒక కార్యక్రమంలో కళ్లను దానం చేస్తున్నట్టు ఆమె ప్రకటించడమే కాకుండా.. అదే వేడుకలో ఆమె సంబంధిత పత్రాలపై సంతకాలు కూడా చేసి వైద్యాధికారులకు అందించింది. ప్రజలకు నేత్రదానం పట్ల అవగాహన కల్పించి వారిలో చైతన్యం కలిగించడానికే తాను ఈ పని చేశానని.. ఓ నిర్ణయం ఇద్దరి జీవితాల్లో వెలుగు నింపుతుందని ఈ సందర్భంగా అమలా పాల్ తెలపడం గమనార్హం.

Trending News