Sai Dharam Tej: అపోలో ఆసుపత్రికి అల్లు అర్జున్.. సాయి ధరమ్ తేజ్‏ను పరామర్శించిన బన్నీ.. ఆరోగ్య పరిస్థితిపై ఆరా!

Sai Dharam Tej: రోడ్డు ప్రమాదానికి గురైన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ను స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్  అపోలో ఆస్పత్రిలో పరామర్శించారు. వివరాల్లోకి వెళితే...  

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 16, 2021, 05:20 PM IST
  • అపోలో ఆసుపత్రికి అల్లు అర్జున్
  • సాయి ధరమ్ తేజ్‏ను పరామర్శించిన స్టైలీష్ స్టార్
  • ఆరోగ్య పరిస్థితిపై ఆరా
Sai Dharam Tej: అపోలో ఆసుపత్రికి అల్లు అర్జున్.. సాయి ధరమ్ తేజ్‏ను పరామర్శించిన బన్నీ.. ఆరోగ్య పరిస్థితిపై ఆరా!

Sai Dharam Tej: మెగా హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. వినాయక చవితి(స్టెప్టెంబర్ 10న) రోజున మాదాపూర్‏లో కొత్తగా నిర్మించిన కేబుల్ బ్రిడ్ పై నుంచి ఐకియా వైపుగా గచ్చిబౌలి వెళుతోన్న సమయంలో తేజ్‌(Sai Dharam Tej) ప్రయాణిస్తోన్న స్పోర్ట్స్‌ బైక్‌(Sports Bike) స్కిడ్‌ అవ్వడంతో ఒక్కసారిగా కింద పడిపోయారు. దీంతో వెంటనే ఆయనను సమీపంలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

 ఆ తర్వాత ఆయనను జూబ్లీ హిల్స్‏లోని అపోలో(Apollo) ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం సాయి ధరమ్‌ తేజ్‌కు అపోలో ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. షోల్డర్‌ బోన్‌ సర్జరీ(Shoulder Bone Surgery) చేసిన వైద్యులు ఆయనను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు అపోలోకు చేరుకుని హీరోని పరామర్శించారు. తాజాగా స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) అపోలో ఆసుపత్రికి వెళ్లారు.

Also read: Allu Arjun Simplicity: పాక హోటల్లో 'పుష్ప రాజ్' ఫిదా అవుతున్న నెటిజన్లు (Video)

తేజ్ ప్రమాదం గురించి ముందు తెలిసింది బన్నీకే..
ఇవాళ అల్లు అర్జున్.. అపోలో ఆసుపత్రికి వెళ్లి తేజ్‏ను పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉంటే.. తేజ్ ప్రమాదం గురించి ముందుగా తెలిసిందే బన్నీకే అంటా.. కానీ.. పుష్ప(Pushpa) షూటింగ్ కారణంగా కాకినాడ వెళ్లిన బన్నీ.. సాయి ధరమ్‏ను పరామర్శించడానికి రాలేకపోయారు. షూటింగ్ అనంతరం హైదరాబాద్ వచ్చిన బన్నీ.. వెంటనే తేజ్‏ను పరామర్శించేందుకు అపోలో ఆసుపత్రికి వెళ్లారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News