ఓ మై కడవులే తెలుగు రీమేక్: విజయ్ సేతుపతి పాత్రలో అల్లు అర్జున్ ?

Allu Arjun in Oh My Kadavule Telugu remake ? తమిళంలో సూపర్ హిట్ అయిన ఓ మై కడవులే సినిమా ప్రస్తుతం తెలుగులో రీమేక్ అవుతోంది. తమిళంలో అశోక్ సెల్వన్, రితిక సింగ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ఓ ముఖ్యమైన గెస్ట్ రోల్ ప్లే చేశాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 5, 2021, 04:55 PM IST
ఓ మై కడవులే తెలుగు రీమేక్: విజయ్ సేతుపతి పాత్రలో అల్లు అర్జున్ ?

Allu Arjun in Oh My Kadavule Telugu remake ? తమిళంలో సూపర్ హిట్ అయిన ఓ మై కడవులే సినిమా ప్రస్తుతం తెలుగులో రీమేక్ అవుతోంది. తమిళంలో అశోక్ సెల్వన్, రితిక సింగ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ఓ ముఖ్యమైన గెస్ట్ రోల్ ప్లే చేశాడు. విజయ్ సేతుపతి పాత్రకు తగిన ప్రాధాన్యత కూడా ఉంటుంది. అందుకే ఈ తమిళంలో విజయ్ సేతుపతి పోషించిన పాత్ర కోసం తెలుగులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ని తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఓ మై కడవులే తెలుగు రీమేక్ యూనిట్ త్వరలోనే అల్లు అర్జున్‌ని కలిసేందుకు నిర్ణయించుకున్నట్టు టాలీవుడ్ టాక్.

ఓ మై కడవులే తెలుగు రీమేక్‌లో (Oh My Kadavule Telugu remake) విశ్వక్ సేన్, మథిలా పాల్కర్ జంటగా నటిస్తున్నారు. పివిపి సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రసాద్ వి పొట్లూరి, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

విజయ్ సేతుపతి పోషించిన పాత్రలో నటించేందుకు అల్లు అర్జున్ (Allu Arjun) ఓకే చెబితే.. ఈ సినిమాకు అదే పెద్ద ప్లస్ పాయింట్ కానుంది అని ఫిలింనగర్ టాక్.

Trending News