Allu Arjun: యానిమల్ రివ్యూ ఇచ్చిన అల్లు అర్జున్.. హీరోహీరోయిన్లపై ప్రశంసలు

Allu Arjun On Ranbir Kapoor Film: డిసెంబర్ 1 నా విడుదలైన సందీప్ రెడ్డివంగా యానిమల్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కొంతమందికి విపరీతంగా నచ్చి మరి కొంతమంది దగ్గర మాత్రం విమర్శల పాలైన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా మాత్రం ఎక్కడ తగ్గడం లేదు. కాగా ఈ చిత్రంపై ఇప్పుడు అల్లు అర్జున్ కూడా రివ్యూ ఇవ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది..

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 8, 2023, 04:48 PM IST
Allu Arjun: యానిమల్ రివ్యూ ఇచ్చిన అల్లు అర్జున్.. హీరోహీరోయిన్లపై ప్రశంసలు

Allu Arjun Reviews Animal: సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందాన హీరోయిన్ గా నటించిన సినిమా యానిమల్.  ఈ సినిమా విడుదలైన దగ్గర నుంచి ఎంతోమంది సెలబ్రిటీస్ ఈ సినిమాని చూసి ప్రశంసిస్తున్నారు. రాంగోపాల్ వర్మ లాంటి వారు కూడా సినిమాలు తీసే స్టైల్ ని సందీప్ రెడ్డి మార్చేశారు అంటూ తెగ మెచ్చుకున్నారు. కాగా ఇప్పుడు ఈ సినిమా విపరీతంగా నచ్చిన వారి లిస్టులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా చేరిపోయారు.

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో అల్లు అర్జున్ త్వరలోనే ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన దర్శకుడి తాజా చిత్రం యానిమల్ చూసి రివ్యూ ఇచ్చేశారు అల్లు అర్జున్. యానిమల్ ఓ సినిమాటిక్ బ్రిలియన్స్ అని అల్లు అర్జున్ ఈ సినిమాని ఆకాశానికెత్తాడు. రణ్‌బీర్, రష్మిక, బాబీ డియోల్, అనిల్ కపూర్, తృప్తి దిమ్రి, సందీప్ రెడ్డి వంగాలపై ప్రశంసలు కురిపించాడు మన బన్నీ.

 

 

‘యానిమిల్.. మైండ్ బ్లోయింగ్ సినిమా. ఈ సినిమాటిక్ బ్రిలియన్స్ చూసి పిచ్చెక్కేసింది. కంగ్రాచులేషన్స్. రణ్‌బీర్ కపూర్ జీ ఇండియన్ సినిమా పర్ఫార్మెన్స్ ను మీరు మీ నటనతో మరో లెవల్ కు తీసుకెళ్లారు. చాలా ఇన్‌స్పైరింగా ఉంది. మీరు క్రియేట్ చేసిన మ్యాజిక్ చూసి నాకు అసలు మాటలు రావడం లేదు. రష్మిక నువ్వు అద్భుతం. ఇప్పటి వరకూ నువ్వు చేసిన సినిమాలలో ఇది నీ బెస్ట్ పర్ఫార్మెన్స్. ఇలాంటివే మరిన్ని రావాలి అని కోరుకుంటున్నాను. 

బాబీ డియోల్ జీ మీ పర్ఫార్మెన్స్ అందరినీ మాటలు లేకుండా చేసింది. అనిల్ కపూర్ జీ మీ అనుభవమే మీరేంటో చెబుతోంది. మీ నటన సూపర్. యంగ్ లేడీ తృప్తి దిమ్రి యువకుల గుండెలు కొల్లగొడుతోంది. ఇక ఇతర ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అత్యుత్తమ పర్ఫార్మెన్స్ చూపించారు. కంగ్రాచులేషన్స్. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గారు.. మీరు మైండ్ బ్లోయింగ్. మీరు అన్ని సినిమాటిక్ పరిమితులను దాటేశారు' అని ఈ సినిమాని ఆకాశానికి ఎత్తేశారు బన్నీ. కాగా యానిమల్ సినిమాపై అల్లు అర్జున్ ఇచ్చిన రివ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

Also Read:  New Ministers History: తెలంగాణా కొత్త మంత్రుల పూర్తి హిస్టరీ..రాజకీయ అరంగేట్రం వివరాలు.. 

Also Read:  CM Revanth Reddy: కొత్త ప్రభుత్వంలో ప్రక్షాళన.. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా శివధర్ రెడ్డి 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News