Allu Arjun: సూపర్ స్టార్ ని మించిపోయిన అల్లు అర్జున్ రెమ్యూనరేషన్.. తగ్గేదేలే అంటున్న హీరో

Pushpa: పుష్ప సినిమాతో అంతర్జాతీయంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు అల్లు అర్జున్. ఈ మధ్యనే నేషనల్ అవార్డు కూడా దక్కించుకున్న ఈ హీరో ఇప్పుడు తన రెమ్యూనరేషన్ విషయంకి గాను వార్తల్లో నిలుస్తున్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 27, 2023, 09:48 AM IST
Allu Arjun: సూపర్ స్టార్ ని మించిపోయిన అల్లు అర్జున్ రెమ్యూనరేషన్.. తగ్గేదేలే అంటున్న హీరో

Allu Arjun Remuneration: గంగోత్రి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అల్లు అర్జున్.. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న కానీ ప్రశంసలు మాత్రం అందుకోలేకపోయాడు. ఒక రకంగా చెప్పాలి అంటే మన బన్నీ మొదటి సినిమాకి ఆయన లుక్స్ పరంగా ఎన్నో విమర్శలు వచ్చాయి. అయితే ఎక్కడ మొదలయ్యామో కాదు ఎలా ఎదిగామో అనేది ముఖ్యం.. అనే మాటని రుజువు చేస్తూ.. తనను విమర్శలు చేసిన వారి దగ్గరే  తో ప్రశంసలు అందుకుంటూ ఎదిగారు ఈ హీరో.

అంతేకాదు ఏకంగా నేషనల్ అవార్డు గెలుచుకున్న మొదటి తెలుగు హీరోగా కూడా నిలిచారు. ముఖ్యంగా పుష్పా సినిమా మన బన్నీని అంతర్జాతీయ లెవెల్ లో పాపులర్ చేసేసింది. ప్రస్తుతం అల్లు అర్జున్ అంటే తెలియని వారు లేరు. అంతర్జాతీయ క్రికెటర్లు సైతం మన బన్నీ పాటలకు స్టెప్పులు వేస్తూ రీల్స్ పెట్టారు అంటేనే ఆయన క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. 

ఇంతలా అభిమానుల్ని సంపాదించుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు రెమ్యూనరేషన్ విషయంలో కూడా తగ్గేదే లే అంటున్నారట. ప్రస్తుతం తన పుష్పా సినిమాకి సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 ది రూల్ కి గాను మన స్టైలిష్ స్టార్ పారితోషికాన్ని ఒక ఫిగర్ లాగా కాకుండా వచ్చే రెవిన్యూలో పర్సెంటెజ్ లాగా తీసుకునేలా ఒప్పందం చేసుకున్నాడట. ఇదే కానీ నిజమైతే ఇదొక పెద్ద షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే పుష్ప 2కి జరిగే బిజినెస్ లో 33 శాతం ఐకాన్ స్టార్ కి ఇచ్చేలా అగ్రిమెంట్ అయ్యింది.. దాన్నిబట్టి చూస్తే అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ దాదాపు 333 కోట్ల వరకు వెళుతుంది.  థియేటర్, డబ్బింగ్, డిజిటల్, ఓటిటి, శాటిలైట్, ఆడియో అన్నీ కలుపుకుని పుష్ప సినిమాకు మొత్తం వెయ్యి కోట్లు బిజినెస్ ఈజీగా జరుగుతుంది..ఇక అందులో మూడు వందల ముప్పై మూడు కోట్లు బన్నీ ఖాతాకు వెళ్లిపోతాయి. 

ఇప్పటివరకు సౌత్ ఇండియాలో సూపర్ స్టార్ రజనీకాంత్ 210 కోట్లు ఛార్జ్ చేసిన హీరోగా వార్తల్లో నిలిచారు. ఇప్పుడు పైన చెప్పిన వార్త నిజమైతే సూపర్ స్టార్ రెమ్యూనరేషన్ ని సైతం దాటేస్తారు మన బన్నీ.

Also Read: BRS-BJP Alliance: హంగ్ ఏర్పడితే బీఆర్ఎస్-బీజేపీ పొత్తు ఉంటుందా, అమిత్ షా ఏమంటున్నారు

Also Read: AB De Villiers Team: ఏబీ డివిలియర్స్ దృష్టిలో బెస్ట్ ప్రపంచకప్ టీమ్ ఇదే

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

Trending News