Pushpa 2 New Release Date: పుష్ప వెనక్కి తగ్గక తప్పలేదు.. ఫైనల్ గా కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్..

Pushpa 2 Postponed: గత కొంతకాలంగా ఆగస్టు 15న విడుదల కావాల్సిన పుష్ప 2 వాయిదా పడబోతోంది.. అని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమా విడుదల హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో పుకార్లకి ఫుల్ స్టాప్ పెడుతూ.. చిత్ర బృందం సినిమా విడుదల తేదీ గురించి అధికారిక ప్రకటన విడుదల చేసింది.  

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 17, 2024, 09:32 PM IST
Pushpa 2 New Release Date: పుష్ప వెనక్కి తగ్గక తప్పలేదు.. ఫైనల్ గా కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్..

Pushpa 2 Release Date: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా.. ఎంత పెద్ద బ్లాక్ బస్టర్..అయిందో అందరికీ గుర్తుంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక మిగతా భాషల్లో.. కూడా ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి.. అనూహ్య స్పందన వచ్చింది. బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన.. ఈ సినిమాకి రెండవ భాగం పుష్ప: ది రూల్ త్వరలో విడుదలకి సిద్ధం అవుతోంది.

సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న.. ఈ సినిమా ఆగస్టు 15న థియేటర్లలో విడుదలవుతుంది.. అని చిత్ర బృందం కొద్ది రోజుల క్రితమే.. ప్రకటించింది. కానీ షూటింగ్ ఇంకా చాలా వరకు పూర్తి కావాల్సి ఉంది. మరోవైపు నిర్మాణాంతర పనులు కూడా ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. కాబట్టి పుష్ప 2 ..అనుకున్న సమయానికి విడుదల అయ్యే అవకాశాలు తక్కువే.. అని పెద్ద ఎత్తుగా వార్తలు రాసాగాయి. 

ఇక సినిమా వాయిదా పడుతుందా లేదా.. ఒకవేళ వాయిదా పడితే ఎప్పుడూ విడుదల అవుతుంది అంటూ.. అభిమానుల్లో ఎన్నో సందేహాలు వెలువెతాయి. తాజాగా వీటన్నిటికీ చెక్ పెడుతూ.. చిత్ర బృందం సినిమా విడుదల గురించి.. క్లారిటీ ఇచ్చేసింది. సినిమా వాయిదా పడింది.. అనే విషయాన్ని ధ్రువీకరిస్తూ.. కొత్త విడుదల తేదీని కూడా ప్రకటించేసింది.

"పుష్ప: ది రూల్ కచ్చితంగా ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా. పుష్ప మొదటి భాగం బ్లాక్ బస్టర్ అయిన తర్వాత.. సినిమా రెండవ భాగం కూడా అద్భుతంగా వచ్చేలా చూసుకోవడం మా బాధ్యత. అందుకే మేము కూడా సినిమాని అనుకున్న సమయానికి విడుదల చేయడానికి చాలా కష్టపడ్డాము. కానీ ఇప్పటికే పెండింగ్లో ఉన్న షూటింగ్, తరువాత చేయాల్సిన నిర్మాణాంతర పనులు కూడా ఉంటాయి కాబట్టి సినిమా ఆగస్టు 15న విడుదల అవ్వడం సాధ్యం కాదు. సినిమా గురించి, ప్రేక్షకుల గురించి, స్టేక్ హోల్డర్స్ గురించి ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాం. క్వాలిటీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా మీకు మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అనేది మా లక్ష్యం. టీజర్ కి పాటలకి వచ్చిన రెస్పాన్స్ చూసి మా మనసు నిండిపోయింది. మీ అందరికీ నచ్చే విధంగా సినిమా ఉంటుందని మేము ప్రమాణం చేస్తున్నాము. ప్రేక్షకులకి ప్రపంచవ్యాప్తంగా మా పార్ట్నర్స్ కి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీడియా ఫిలిం ఇండస్ట్రీ కూడా మాకు ఎంతగానో సపోర్ట్ చేశాయి. పుష్ప ది రూల్ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 6న విడుదల అవుతుంది. మీరు త్వరలో ది బెస్ట్ సినిమా చూస్తారు" అంటూ చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.

సినిమా వాయిదా పడుతున్నందుకు అభిమానులు కొంత నిరాశ చెందినప్పటికీ.. చిత్ర బృందం.. కొత్త విడుదల తేదీని కూడా ప్రకటించడం కొంత ఉరట కలిగిస్తోంది. అయితే డిసెంబర్లో ఆల్రెడీ కొన్ని సినిమాలు విడుదల కి సిద్ధం అవుతున్నాయి. ఇప్పుడు పుష్ప టు లాంటి పెద్ద సినిమా కూడా డిసెంబర్ బరిలోకి.. రావడంతో ఇదే నెలలో విడుదల కావాల్సిన మిగతా సినిమాల పరిస్థితి ఇంకా తెలియాల్సి ఉంది. పుష్ప టు వల్ల మిగతా డిసెంబర్ సినిమాలో డిస్టర్బ్ అవుతాయి అని అయితే చెప్పుకోవచ్చు.

Read more; Lovers Jumping into River: నదిలో దూకిన ప్రేమజంట.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన మత్స్యకారుడు.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News