Pushpa 2 Movie HD Print in Online: అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా పుష్ప. రెండు భాగాలుగా విడుదలవుతున్న ఈ సినిమా.. మొదటి భాగం ఈరోజు అనగా డిసెంబర్ 5న …ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇక ఈ సినిమా ప్రీమియర్స్ డిసెంబర్ 4న రాత్రి పడగా.. వాటి టికెట్స్ ఏంటో డిమాండ్తో అమ్ముడుపోయాయి. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా.. మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. ముఖ్యంగా కలెక్షన్స్ పరంగా ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేసేలా కనిపిస్తోంది. ఈ చిత్రం టికెట్ రేట్స్ విపరీతంగా ఉండటంతో.. కలెక్షన్స్ కూడా ఆరెంజ్ లోనే వస్తాయి అని అంచనా వేస్తున్నారు.
కాగా పుష్ప మొదటి భాగం.. అప్పట్లో ఎంత డిస్టెన్స్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలో ఈ సినిమా రెండో భాగంపై మొదటి నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈ అంచనాల వల్లే కాబోలు.. సినిమా టికెట్ రేట్లు భారీగా పెంచినప్పటికీ.. ప్రీమియర్స్ కి.. మొదటి రోజుకి షోలకి.. ఎన్నో దగ్గర్లో హౌస్ఫుల్ బోర్డులు పడ్డాయి.
అంతేకాకుండా సినిమా తప్పకుండా లాంగ్ రాన్ లో మంచి కలెక్షన్స్ రాబడుతుంది.. అని ట్రెడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నారు.
కాగా ఇలాంటి టైం లో.. ఈ సినిమా టీమ్ కి పెద్ద షాక్ తగిలింది. అదేమిటి అంటే ఈ చిత్రం విడుదలైన కొద్ది గంటలకే.. ఈ సినిమా మొత్తం.. హెచ్ డి ప్రింట్ ఆన్లైన్ లో లీక్ అయ్యింది. ఈ చిత్రం దాదాపు మూడు గంటల.. పది నిమిషాలు రన్‍టైమ్ తో రాగా.. సినిమా మొత్తం కూడా ఆన్లైన్ లో పెట్టేయడంతో..సినీ ప్రేక్షకులు, అలానే చిత్ర యోని షాక్ కి గురవుతున్నారు. మరి ఈ పైరసీ దెబ్బ నుంచి పుష్ప సినిమా.. ఎలా బయట పడుతుందో చూడాలి.
మరోపక్క ఈ సినిమా టికెట్ రేట్లు కూడా ఈ చిత్రానికి కొంత మైనస్ గా నిలుస్తున్నాయి. డిసెంబర్ 16 వరకు ఇవే టికెట్ రేట్లు ఉంటాయని సమాచారం. మరి ఆ తరువాత థియేటర్స్ కి వెళ్లి చూస్తారా.. లేకపోతే ప్రేక్షకులు ఓటిటిలో చూసేద్దాం అనుకుంటారా అనే సందేహాలు కూడా కొంతమందికి ఉన్నాయి. ఏదేమైనా ప్రస్తుతం మొదటి రెండు రోజులు మాత్రం పుష్ప హవా.. తగ్గేదేలే.. అని కొనసాగుతోంది.
Also Read: Teacher Murder: ఏపీలో దారుణం.. గొడవను ఆపిన టీచర్‌ను చంపేసిన విద్యార్థులు
Also Read: Naga Babu: అల్లు అర్జున్ కోసం రంగంలోకి నాగబాబు.. వెనక్కి తగ్గిన జనసేన పార్టీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.