Pushpa 2: ఇక అల్లు అర్జున్ సినిమాకి 1000 కోట్లు కష్టమే.. కారణమేమిటంటే!

Pushpa 2 Update: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాపై.. భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఈ సినిమా అనుకున్నట్టుగా 1000 కోట్ల కలెక్షన్లు.. అందుకుంటుందా.. లేదా.. అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి ఎందుకు అనేది. ఒకసారి చూద్దాం రండి..  

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 18, 2024, 01:38 PM IST
Pushpa 2: ఇక అల్లు అర్జున్ సినిమాకి 1000 కోట్లు కష్టమే.. కారణమేమిటంటే!

Pushpa 2 Release Date: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ దర్శకత్వంలో.. ప్రేక్షకులు ముందుకు రాబోతున్న సినిమా పుష్ప: ది రూల్. ఈ సినిమా పైన అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. సినిమాకి సంబంధించిన ప్రతి అప్డేట్.. సినిమా పైన అంచనాలను రెట్టింపు చేస్తూ వస్తోంది. నిజానికి ఈ సినిమా ఆగస్టు 15న.. థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. 

కానీ ఇంకా షూటింగ్ పనులు, నిర్మాణాంతర పనులు పెండింగ్ లోనే.. ఉండటంతో సినిమాని వాయిదా వేస్తున్నట్లు.. చిత్ర బృందం ప్రకటించింది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా.. ఇప్పుడు డిసెంబర్ 6న.. థియేటర్లలో విడుదలకి సిద్ధం అవుతోంది. తెలుగులో మాత్రమే కాక ప్యాన్ ఇండియా రేంజ్ లో.. ఈ సినిమా విడుదలవుతుంది. 

అయితే గతంలో రికార్డులు సృష్టించిన పుష్ప: ది రైజ్ సినిమాకి రెండవ భాగంగా.. విడుదల కాబోతున్న ఈ సినిమా.. 1000 కోట్ల కలెక్షన్లను అందుకుంటుంది అని.. కొందరు అంచనాలు వేశారు. ఎంత సినిమాపై అంచనాలు ఉన్నప్పటికీ.. 1000 కోట్లు అనేది చాలా పెద్ద నంబర్ అవుతుంది అని మరికొందరు అభిప్రాయపడ్డారు. అయితే దీని గురించి నిన్న విడుదల తేదీ వల్ల ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా నిజంగా ముందుగా అనుకున్నట్టు.. ఆగస్టు 15 విడుదల అయ్యి ఉంటే.. 1000 కోట్లు సంపాదించి ఉండొచ్చు. అందుకు ముఖ్య కారణం ఆ వారంలో హిందీలో పెద్ద రిలీజులు లేవు. తెలుగులో కూడా ఆ వారం.. ఆ తరువాత వారాలు స్టార్ హీరో సినిమాల రిలీజ్లు లేవు.

కానీ కానీ ప్రస్తుతం ప్రకటించిన.. డిసెంబర్  6 చుట్టూ మాత్రం కొన్ని సమస్యలు ఉన్నాయి. తెలుగులో నాగచైతన్య తండేల్, నితిన్ రాబిన్ హుడ్ సినిమాలు డిసెంబర్ లో విడుదల కి సిద్ధం అవుతున్నాయి. పుష్ప 2 రిలీజ్ డేట్ అధికారికంగా వచ్చేసింది కాబట్టి.. ఈ రెండు సినిమాలు వాయిదా పడితే పడొచ్చు. 

కానీ సినిమా వెయ్యి కోట్ల కలెక్షన్లు అందుకోవాలి అంటే తెలుగులో మాత్రమే కాకుండా.. నార్త్ సైడ్, ఓవర్సీస్ లో కూడా భారీ కలెక్షన్లు నమోదు చేయాల్సి ఉంటుంది. హిందీలో డిసెంబర్ లో.. అమీర్ ఖాన్.. సితారే జమీన్ పర్ సినిమా విడుదల అవబోతోంది. మరోవైపు హాలీవుడ్ లో కూడా ముఫాస: ది లయన్ కింగ్ సినిమా అదే సమయంలో విడుదలకి.. రెడీగా ఉంది. 

ఈ రెండు సినిమాలపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ రెండు సినిమాలు పుష్ప 2.. కలెక్షన్ల మీద.. ఎఫెక్ట్ చూపించే అవకాశం లేకపోలేదు. 1000 కోట్ల మార్క్ రీచ్ అవ్వాలి అంటే పుష్ప 2 సినిమా.. ఎటువంటి అడ్డంకులు లేకుండా.. కనీసం రెండు నుంచి మూడు వారాలు థియేటర్లలో స్ట్రాంగ్ గా.. ఆడాల్సిన అవసరం ఉంది. మరి మధ్యలో విడుదల అయ్యే సినిమాలు ఈ సినిమా కలెక్షన్లను దెబ్బతీస్తాయా లేదా వేచి చూడాల్సి ఉంది.

Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News