Allu Arjun Hit Songs As Movie Titles అల్లు అర్జున్ సినిమాల్లోని హిట్టు పాటలు, అందులోని హుక్ లైన్‌ను సినిటా టైటిల్స్‌గా వాడుకుంటూ ఉంటారు మిగతా హీరోలు. ఇలా కొన్నేళ్ల నుంచి జరుగుతూనే వస్తోంది. అలా బన్నీ పాటల్లోంచి సినిమా టైటిల్స్‌గా వచ్చినవెన్నో కూడా బ్లాక్ బస్టర్‌గా నిలిచారు. చివరకు ప్రభాస్ కూడా బన్నీ పాటను వాడేసుకున్నాడు. ఆర్య 2 సినిమాలోని మిస్టర్ పర్ఫెక్ట్ పాటను టైటిల్‌గా వాడేసుకున్నాడు బన్నీ.
ఇలా ఎంతో మంది హీరోలు, మేకర్లు బన్నీ మూవీ సాంగ్స్, అందులోని పాటలను వాడేసుకున్నారు. అవి ఏంటో ఓ సారి చూద్దాం. సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలోని సూపర్ మచ్చి పాటను కళ్యాణ్ దేవ్ వాడేసుకున్నాడు. సూపర్ మచ్చి అనే సినిమాతో గత ఏడాది కళ్యాణ్ దేవ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
గోపీచంద్ సైతం సీటీమార్ అంటూ బన్నీ పాటను వాడేసుకున్నాడు. బన్నీ నటించిన డీజే సినిమాలో సీటీమార్ అనే సాంగ్ ఉంటుంది. ఆ పాటను ఇలా టైటిల్‌గా వాడేసుకున్నాడు. బన్నీ ఐకానిక్ డైలాగ్ తగ్గేదేలేను కూడా వాడుకున్నారు. తగ్గేదే లే అంటూ సినిమా టైటిల్‌ను సైతం వాడేసుకున్నారు. ఇక అలవైకుంఠపురములో సామజవరగమన, బుట్టబొమ్మలను కూడా సినిమా టైటిల్స్‌గా పెట్టేసుకున్నారు.
రాజ్ తరుణ్ అవికా గోర్ కాంబోలో వచ్చిన సినిమా చూపిస్త మావ సైతం బన్నీ నటించిన సినిమాలోని పాటే. అల్లు అర్జున్, శ్రుతి హాసన్ సినిమా చూపిస్త మావ పాటకు వేసిన స్టెప్పులు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. తమన్ కొట్టిన ఈ పాట అప్పట్లో సంచలనంగా మారింది. అందుకే సినిమా చూపిస్త మావ అనే టైటిల్‌ను వాడేసుకుని రాజ్ తరుణ్ హిట్ కొట్టేశాడు.
ఇలా బన్నీ సినిమాల్లోని పాటలు సినిమా టైటిల్స్‌గా వస్తుండటం, అవి బ్లాక్ బస్టర్లు అవ్వడం కామన్ అయ్యాయి. మరి మున్ముందు బన్నీ ఇంకా ఎన్ని సినిమా టైటిల్స్ ఇస్తాడో చూడాలి. పుష్ప ది రూల్ కోసం దేవీ శ్రీ ప్రసాద్ ఇంకొన్ని కొత్త ట్యూన్లు కొట్టేస్తున్నాడట. మరి అందులోంచి ఏమైనా టైటిల్స్ వస్తాయా? లేదా? అన్నది చూడాలి.
Also Read: Amala Akkineni : కుక్కల మీద అలాంటి కామెంట్లు చేసిందా?.. అమల నిజంగానే అలా అనేసిందా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook