Inside story of Allu Arjun in Jani Master case: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్.. లైంగిక వేధింపుల కేసులో.. రెండు వారాలపాటు చంచల్ గూడా జైల్లో రిమాండ్ లో ఉన్న.. విషయం తెలిసిందే. ఈ వార్త రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించింది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉందన్న విషయాన్ని.. ఈ కేస్ మరోసారి రుజువు చేసింది అంటూ ఎంతోమంది వ్యాఖ్యలు చేశారు.
అసలు విషయానికి వస్తే.. కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్న జానీ మాస్టర్ కారణంగా తాను లైంగిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను.. అంటూ ఒక జూనియర్ మహిళ కొరియోగ్రాఫర్ రాయదుర్గం పోలీసులను ఆశ్రయించడంతో.. ఈ కథ మొదలైంది.
అయితే ఈ ఘటన నార్సింగి పరిధిలోకి రావడంతో జీరో ఎఫ్ఐఆర్ ను సెప్టెంబర్ 15వ.. తేదీన మధ్యాహ్నం రాయదుర్గం పోలీసులు నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి.. బదిలీ చేశారు. ఆ తర్వాత రంగంలోకి దిగిన పోలీసులు జానీ మాస్టర్ ను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా.. ఆయన పరారీలో ఉన్నట్టు వార్తలు కూడా వినిపించాయి. కానీ గోవాలో ఉన్నట్లు గుర్తించి.. ఆయనను అరెస్టు చేశారు.
2017లో తన టీమ్ లో చేర్చుకొని.. అవుట్ డోర్ షూటింగ్లో ముంబైలో బస చేసిన హోటల్ పై తనపై అత్యాచారం చేశాడని , బహిరంగంగా పెళ్లి చేసుకోమని వేధించేవాడని, ఆ దాడి నుంచి తట్టుకోలేక ఇలా కంప్లైంట్ ఇస్తున్నానంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు తాను మైనర్ గా ఉన్నప్పుడే తనపై లైంగిక దాడి చేశాడని పోలీసులకు చెప్పడంతో జానీ మాస్టర్ పై పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. ప్రస్తుతం చెంచల్ గూడా జైల్లో రిమాండ్ లో.. ఉన్నారు జానీ మాస్టర్.
అయితే జానీ మాస్టర్ కి సంబంధించిన ఈ విషయాలు తెరపైకి రావడంతో చాలామంది సెలబ్రిటీలు జానీ మాస్టర్ ప్రవర్తన పై.. మండిపడ్డారు.పైగా అల్లు అర్జున్ కూడా జానీ మాస్టర్ కు వ్యతిరేకంగా బాదిత యువతకి అండగా నిలిచారని, ఇందులో భాగంగానే.. తను నటిస్తున్న పుష్ప 2 సినిమాలో అవకాశం కల్పించినట్లు వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఇందులో నిజం లేదని, అసలు నిజం ఇదే అంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది.
అసలు విషయంలోకి వెళితే, అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో పుష్ప సినిమా వచ్చింది. ఈ సినిమాకి కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ పనిచేశారు. ఆ తర్వాత పుష్ప 2 కి మాత్రం బాధిత యువతి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పని చేశారు. జానీ మాస్టర్ పై కేస్ ఫైల్ అయిన తర్వాత తనకు సహాయం చేయాలని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తనను పని నుండి తీసేయవద్దు అని, సెట్ లో ఒకరోజు కేరవాన్ నుండి వస్తున్న.. అల్లు అర్జున్ ను వేడుకుందట బాధిత యువతి. దీంతో కనుకరించిన అల్లు అర్జున్.. మీ పనికి ఎటువంటి ఇబ్బంది మేము కలిగించము.. దయచేసి మీరు పని చేసుకోండి అంటూ ఆమెకు చెప్పారట. అయితే కొన్ని మీడియా ఛానల్స్ మాత్రం అల్లు అర్జున్ ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు అంటూ తప్పుగా వార్తలు ప్రచురించాయి. పైగా ప్రముఖ యాంకర్ ఝాన్సీ ఈ విషయంపై ఆరా తీయగా.. తనకు అల్లు అర్జున్ సపోర్టుగా నిలుస్తున్నారు అంటూ బాధితురాలు చెప్పకువచ్చిందట. అయితే ఝాన్సీ మీడియా ముందర ఆ అమ్మాయి వెనక ఒక స్టార్ హీరో కూడా ఉన్నారు అని చెప్పడంతో.. అది మిగతా వాళ్లకి కొంచెం వేరుగా అర్థమయింది. దీంతో కావాలనే అల్లు అర్జున్ ఇదంతా చేశారని.. లేనిపోని రూమర్స్ బయటకి వచ్చాయి.
మొత్తానికైతే ఆమెను పని నుండి తీసేయకుండా పని మాత్రమే ఇచ్చారు బన్నీ. కానీ జానీ మాస్టర్ కేసులో ఆ అమ్మాయికి ఎటువంటి సపోర్టు..అల్లు అర్జున్ చేయలేదు అని సమాచారం. ఏది ఏమైనా తనకు తెలియకపోయినా అల్లు అర్జున్.. ఈ కేసులో ఇరుక్కున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read: Tirumala Laddu Row: సుప్రీంకోర్టు నిర్ణయం మోదీ, చంద్రబాబుకు చెంపపెట్టు: వైఎస్ షర్మిల
Also Read: APSRTC: దసర పండగ... ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన ఏపీఎస్ఆర్టీసీ.. డిటెయిల్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.