Alia Bhatt Birthday: రణబీర్ -అలియా భట్ల ప్రేమ కధ తెలుసా... మీరు ఊహించిఉండరు!

Alia Bhatt Love Story in telugu: ఈరోజు అలియా పుట్టినరోజు సందర్భంగా ఆమె జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీ ముందుకు తెస్తున్నాం, చూసేయండి.   

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 15, 2023, 12:58 PM IST
Alia Bhatt Birthday: రణబీర్ -అలియా భట్ల ప్రేమ కధ తెలుసా... మీరు ఊహించిఉండరు!

Alia Bhatt Love Story: అతి చిన్న వయసులోనే తన నటనతో బాలీవుడ్‌లో సూపర్ స్టార్ క్రేజ్ సంపాదించుకున్న అలియా భట్ పుట్టినరోజు నేడు. అలియాకు ఈ రోజుతో 30 ఏళ్లు నిండాయి. 1993 మార్చి 15న జన్మించిన అలియాకు ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు, ఎందుకంటే రణబీర్ కపూర్‌ని పెళ్లి చేసుకుని కూతురు రాహాకు జన్మనిచ్చిన తర్వాత అలియాకి ఇదే మొదటి పుట్టినరోజు కాబట్టి. గత ఏడాది రణబీర్ కపూర్‌ని ఆమె పెళ్లి చేసుకున్నారు. అలియా ఆరేళ్ల వయసులో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిందని చాలా తక్కువ మందికి తెలుసు. అందుకే ఈరోజు అలియా పుట్టినరోజు సందర్భంగా ఆమె జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీ ముందుకు తెస్తున్నాం.

అలియా భట్ 1993 మార్చి 15న జన్మించింది, చిన్నప్పటి నుంచి అలియా భట్‌కి తన సోదరి పూజా భట్‌లాగా నటిగా మారడం అంటే ఇష్టంగా ఉంది. అలియా భట్ బాలీవుడ్ ప్రముఖ నిర్మాత-దర్శకుడు మహేష్ భట్ కుమార్తె కావడంతో ఆమెకు నటన రక్తంలోనే ఇమిడిపోయింది. అలియా తొలిసారిగా 1999లో తన తండ్రి థ్రిల్లర్ చిత్రం 'సంఘర్ష్'లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తెరపై కనిపించింది. ఆ సమయంలో అలియా వయసు కేవలం 6 సంవత్సరాలు మాత్రమే. ఇక నటిగా ఆమె కెరీర్ 2012 సంవత్సరంలో కరణ్ జోహార్ చిత్రం 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్'తో ప్రారంభమైంది. ఈ సినిమా కోసం, 400 నుండి 500 మంది అమ్మాయిలను ఆడిషన్ చేయగా అలియా అందులో ఒకరిగా సెలక్ట్ అయింది.

ఆమె ఆ పాత్ర కోసం ఎంపికయ్యాక దాదాపు 16 కిలోలు తగ్గింది. అలియా కెరీర్‌లో ఇప్పటివరకు 'హైవే', 'ఉడ్తా పంజాబ్', 'రాజీ', 'గల్లీ బాయ్', 'గంగూబాయి కతియావాడి' వంటి ఎన్నో సూపర్‌హిట్ సినిమాల్లో నటించింది. ఇక అలియా భట్, రణబీర్ ల ప్రేమ కథ గురించి చెప్పాలంటే వారి ప్రేమ కథ సినిమా స్క్రిప్ట్ కంటే తక్కువ ఏమీ కాదు. రణబీర్, అలియా వయసులో 11 ఏళ్ల తేడా ఉందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు కూడా. తమ ప్రేమను పెళ్లి అనే పవిత్ర బంధానికి తీసుకెళ్లిన రణ్‌బీర్-ఆలియా.. ఏజ్ ఒక నెంబర్ మాత్రమేనని నిరూపించారు. రణబీర్ కంటే అలియా 11 ఏళ్లు చిన్నది కాబట్టి రణబీర్ మొదట అలియాతో ప్రేమలో పడి ఉంటాడని అనుకుంటున్నారు, కానీ వాస్తవానికి అది నిజం కాదు.

మీడియా కథనాల ప్రకారం, రణబీర్ కపూర్‌ను చూసిన మొదటి చూపులోనే అలియా భట్ ఫ్లాట్ అయిపొయింది. రణబీర్ కపూర్ సంజయ్ లీలా బన్సాలీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న 'బ్లాక్' సినిమా సెట్స్‌లో మొదటిసారి కలిసినప్పుడు అలియా వయసు కేవలం 11 సంవత్సరాలు. 2012లో తన తొలి చిత్రం స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌తో తన కెరీర్‌ను ప్రారంభించిన తర్వాత, 2014లో కరణ్ జోహార్ చాట్ షో కాఫీ విత్ కరణ్‌లో అలియాను ఇంటర్వ్యూ చేసినప్పుడు, కరణ్ ఆమెను అలియా మీకు స్వయంవరం పెడితే మీరు ఏ ముగ్గురు నటులను చూడాలనుకుంటున్నారు? అనే ప్రశ్నకు సమాధానంగా, అలియా మొదట రణబీర్ కపూర్ పేరును ప్రస్తావించింది, ఆ తర్వాత ఆమె తన ఆప్షన్గా సల్మాన్ ఖాన్, ఆదిత్య రాయ్ కపూర్‌ల పేర్లు కూడా చెప్పింది.

అలియా తన మనసులో రణబీర్‌కి ఎప్పుడో గుడి కట్టేసింది కానీ అయాన్ ముఖర్జీ వల్ల రణబీర్‌తో సాన్నిహిత్యం పెంచుకునే అవకాశం వచ్చింది. అయాన్ డైరెక్షన్లో బ్రహ్మాస్త్రా కోసం రణబీర్ సరసన నటించేందుకు అలియాను సంతకం చేసింది. ఇద్దరూ సెట్స్‌లో కలుసుకుంటూనే ఉన్న క్రమంలో ఆలియా, రణబీర్‌ల ప్రేమ చిగురించింది. 2018లో తొలిసారిగా వారిద్దరూ సోనమ్ కపూర్, ఆనంద్ అహుజా వివాహ రిసెప్షన్‌కు లవ్ కపుల్ గా వచ్చారు. అప్పుడు వారి ప్రేమ వ్యవహారం గురించి ప్రపంచానికి తెలిసింది.

సోనమ్ పెళ్లిలో అలియా మరియు రణబీర్ ఒకరి చేతులు మరొకరు పట్టుకుని కనిపించారు. ఆ తర్వాత, అలియా రణబీర్ సహా అతని కుటుంబంతో కలిసి కనిపించడం ప్రారంభించింది. సెలవుల్లో కూడా ఇద్దరూ కలిసి కనిపించడంతో వీరి ప్రేమ వ్యవహారం మీద క్లారిటీ వచ్చేసింది. ఇక 2020 సంవత్సరంలో, రణబీర్ ఒక ఇంటర్వ్యూలో తనకు ప్రేయసి ఉందని అంగీకరించాడు. అలా మరోవైపు బ్రహ్మాస్త్ర సినిమా సెట్స్‌పై మొదలైన అలియా రణబీర్ ప్రేమకథ ఇప్పుడు పెళ్లితో ముందుకు వెళుతోంది. 
Also Read: Allu Arjun Trolled: ఎన్టీఆర్ తెలుగు ప్రైడ్.. చరణ్ లవ్లీ బ్రదరేనా? ఇదేం తేడా బన్నీ?

Also Read: RRR Craze: ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్ నెంబర్ 1, రామ్ చరణ్ నెంబర్ 2.. ఇది కదా క్రేజ్ అంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

 

Trending News