Mission Raniganj oscars : ఆస్కార్‌ రేసులో అక్షయ్‌కుమార్‌ నయా మూవీ..!

Mission Raniganj Movie: అక్షయ్ కుమార్ అపజయాల పరంపర కొనసాగుతోంది. ఈ జాబితాలోకి ‘మిషన్‌ రాణిగంజ్‌’ కూడా చేరింది. అయితే ఈ మూవీకి కలెక్షన్స్ రాకపోయినా.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే తాజాగా ఈ మూవీని ఆస్కార్ బరిలో నింపేందుకు రెడీ అయ్యారు మేకర్స్.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 14, 2023, 09:52 PM IST
Mission Raniganj oscars : ఆస్కార్‌ రేసులో అక్షయ్‌కుమార్‌ నయా మూవీ..!

Mission Raniganj Movie: ఇటీవల 'ఓ మై గాడ్2' మూవీతో హిట్ ట్రాక్ పట్టాడు అక్షయ్ కుమార్. ఈ మూవీ 200 కోట్ల క్లబ్ లో చేరింది. అయితే అక్షయ్ తాజా సినిమా ‘మిషన్‌ రాణిగంజ్‌’. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ కలెక్షన్స్ మాత్రం రాబట్టలేకపోయింది. ఎనిమిది రోజుల్లో ఈ మూవీ కేవలం రూ.20 కోట్లు మాత్రమే కొల్లగొట్టింది. అక్షయ్‌ కుమార్‌ కెరీర్‌లో లోయెస్ట్‌ ఓపెనింగ్స్‌ ఈ మూవీ నిలిచింది. ఈ మూవీ అక్షయ్ కెరీర్ లో మరో డిజాస్టర్ గా నిలిచింది. క్రిటిక్స్‌ నుంచి ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ మూవీని  జనరల్ కేటగిరీలో ఇండిపెండెంట్‌గా ఆస్కార్‌ నామినేషన్ కు పంపారు. 

1989లో పశ్చిమ బెంగాల్‌లోని బొగ్గు గనిలో వరదలు వచ్చినప్పుడు జస్వంత్ సింగ్‌ గిల్‌ అనే ఒక ఇంజనీర్ 65 మంది కార్మికులను రక్షించాడు. ఆయన నిజ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను సురేశ్ దేశాయ్‌ తెరకెక్కించాడు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, పరిణీతి చోప్రా, కుముద్ మిశ్రా, పవన్ మల్హోత్రా, రవి కిషన్, వరుణ్ బడోలా, దిబ్యేందు భట్టాచార్య, రాజేష్ శర్మ, వీరేంద్ర సక్సేనా, శిశిర్ శర్మ, అనంత్ మహదేవన్, జమీల్ ఖాన్, సుధీర్ పాండే తదితరులు కీలకపాత్రలు పోషించారు.  ఇప్పటికే ఇండియా తరుపున అధికారికంగా మలయాళ సినిమా 2018ను ఆస్కార్‌కు పంపించారు. 2018లో కేరళలో వచ్చిన వరదల నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. ఈ చిత్రం రూ.150 కోట్లకుపైగా వసూలు చేసింది. 

Also Read: BB 7 Telugu Elimination: ఆరో వారం ఎలిమినేషన్‌లో అదిరిపోయే ట్విస్ట్.. డేంజర్ జోన్ లో ఆ బ్యూటీ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News