Agent Teaser: అప్పటి నుంచి దేశం మొత్తం వెయిట్ చేస్తుంది.. ఏజెంట్ టీజర్ ప్రకటనతో అంచనాలు పెంచేశారుగా!

Agent Teaser Release Date: ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఏజెంట్ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేస్తున్నామంటూ సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. జూలై 15వ తేదీన ఈ సినిమా టీజర్ విడుదల చేస్తామని పేర్కొన్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 10, 2022, 07:42 PM IST
  • అఖిల్ హీరోగా ఏజెంట్
  • కెరీర్లో మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా
  • జూలై 15న టీజర్ రిలీజ్ చేస్తున్నామంటూ ప్రకటన
Agent Teaser: అప్పటి నుంచి దేశం మొత్తం వెయిట్ చేస్తుంది.. ఏజెంట్ టీజర్ ప్రకటనతో  అంచనాలు పెంచేశారుగా!

Akhil's Agent Teaser Release Date: అక్కినేని నాగార్జున నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన అఖిల్ బాల నటుడిగా సిసింద్రీ సినిమాతో మెప్పించాడు. కానీ హీరోగా మారిన తర్వాత సరైన హిట్ కొట్టలేకపోయారు. దాదాపు మూడు సినిమాలు చేసిన తర్వాత ఆయన నాలుగో సినిమాతో హిట్ అందుకున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో హిట్టు కొట్టిన అఖిల్ ఆ తరువాత హిట్స్ పరంపర కొనసాగించాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. 

అందులో భాగంగానే వక్కంతం వంశీ అందించిన కధతో ప్రస్తుతం సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను స్టైలిష్ డైరెక్టర్ గా పేరు ఉన్న సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఏజెంట్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అఖిల్ ఒక రక్షణ విభాగానికి చెందిన ఏజెంట్గా కనిపించబోతున్నాడు అనే ప్రచారం జరుగుతోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. 

అఖిల్ కెరీర్ లో మొట్టమొదటి ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేస్తున్నామంటూ సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. జూలై 15వ తేదీన ఈ సినిమా టీజర్ విడుదల చేస్తామని టీజర్ చూసిన తర్వాత భారతదేశం మొత్తం ఏజెంట్ కోసం ఎదురుచూస్తూ ఉంటుందని పేర్కొన్నారు. ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటిస్తూ ఉండడంతో తొలుత తెలుగు సహా మలయాళ భాషలలో విడుదల చేసే అవకాశం ఉందని భావించారు. కానీ ఇప్పుడు ప్యాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ అఖిల్ మూవీకి హిప్ హాప్ తమిజా సంగీతం అందించగా, రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫర్ గా వ్యవహరిస్తున్నారు. 

Read Also: Adire Abhi: కిరాక్ ఆర్పీ కామెంట్స్ పై ఓపెన్ అయిన అదిరే అభి.. మొదటి నుంచి అంతే అంటూ!

Read Also: Babu Mohan: విషం పెట్టి చంపాలని చూశారు.. షాకింగ్ విషయం బయటపెట్టిన బాబూమోహన్

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News